జూనియర్ ఎన్టీఆర్ బావమరిది నార్నీ నితిన్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈయన మ్యాడ్ అనే మూవీ తో మంచి విజయాన్ని అందుకొని తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ఒక మంచి గుర్తింపును ఏర్పరచుకున్నాడు. ఇకపోతే తాజాగా ఈ నటుడు ఆయ్ అనే సినిమాలో హీరోగా నటించాడు. ఈ సినిమా ఆగస్టు 15 వ తేదీన మంచి అంచనాల నడుమ థియేటర్ లలో విడుదల అయింది. ఈ సినిమాకు అద్భుతమైన బ్లాక్ బస్టర్ టాక్ రావడంతో ప్రస్తుతం ఈ సినిమా అద్భుతమైన స్థాయిలో కలెక్షన్ లను వసూలు చేస్తూ ఫుల్ జోష్ లో దూసుకుపోతుంది.
ఇకపోతే ఈ సినిమాకు అంజి కే మణిపుత్ర దర్శకత్వం వహించాడు. ఈ సినిమా అద్భుతమైన సక్సెస్ సాధించడంతో ఈ మూవీ దర్శకుడు అయినటువంటి అంజి కే మణిపుత్ర మీడియాతో మాట్లాడారు. ఆయన తాజాగా మాట్లాడుతూ ... ఈ కథ మొత్తం రాసుకున్న తర్వాత చాలా మంది హీరోలను కలిశాను. ఈ మూవీ కథను వినిపించాను. కానీ ఎవరు కూడా ఈ సినిమా చేయడానికి ముందుకు రాలేదు. కొన్ని కారణాల వల్ల నార్ని నితిన్ ను కలిసాను. ఆయనకు ఈ సినిమా కథ మొత్తం వివరించాను. ఆయనకు ఈ మూవీ కథ అద్భుతంగా నచ్చింది.
దానితో వెంటనే ఆయన ఈ కథ తో సినిమా చేయడానికి ఒప్పుకున్నారు. ఈ సినిమా ప్రస్తుతం థియేటర్లో చూసిన తర్వాత ఆయన లేకపోతే సినిమానే లేదు అనే ఫీలింగ్ కలుగుతుంది. ఈ రోజు నేను మీ ముందు ఇలా కూర్చున్నాను అంటే కూడా దానికి కారణం ఆయనే. నాకు తొలి దర్శకుడిగా అవకాశం ఇచ్చిన అతడిని నేను జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేను అని తాజాగా ఆయ్ మూవీ దర్శకుడు అంజి చెప్పుకొచ్చాడు. ఇకపోతే ఈ సినిమాతో పాటు డబల్ ఇస్మార్ట్ , మిస్టర్ బచ్చన్ తమిళ డబ్బింగ్ మూవీ తంగాలన్ కూడా విడుదల అయ్యాయి. కానీ ఈ సినిమానే మంచి కలెక్షన్లను వసూలు చేస్తుంది.