ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప ది రూల్ కోసం ఏకంగా మూడు సంవత్సరాల సమయం కేటాయించారు. ఒక హీరో సినిమా కోసం ఇన్నేళ్ల సమయం కేటాయించారంటే ఆ సినిమాపై ఏ స్థాయిలో అంచనాలు నెలకొన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ఈ ఏడాది డిసెంబర్ నెల 6వ తేదీన ఈ సినిమా థియేటర్లలో విడుదల కానున్న సంగతి తెలిసిందే. సినిమా రిలీజ్ డేట్ విషయంలో ఏ మాత్రం మార్పు లేదని తెలుస్తోంది.ఇదిలావుండగా చిరంజీవి పుట్టిన రోజ సందర్భంగా ఆయన నటించిన సూపర్ హిట్ సినిమా ''ఇంద్ర''ను రీ రిలీజ్ చేయడం జరిగింది. మరోవైపు మెగాస్టార్ పుట్టిన కావడంతో పలువురు సెలబ్రిటీలు సోషల్ మీడియాలో ఆయనకు బర్త్ డే విషెష్ చెబుతున్నారు. తాజాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సైతం మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా ఆయనకు విషెష్ తెలిపారు. సోషల్ మీడియా వేదికగా అల్లు అర్జున్ స్పందిస్తూ.. మన మెగాస్టార్ చిరంజీవి గారికి మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే అంటూ శుభాకాంక్షలు తెలిపారు.
అయితే తనకు లైఫ్ ఇచ్చిన చిరంజీవికి సింపుల్‌గా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలపడంపై మెగా అభిమానులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.దీనిపై అల్లు అర్జున్ను మెగా అభిమానులు తెగ ట్రోల్ చేస్తున్నారు.
ఇదిలా ఉంటే మారుతీ నగర్ సుబ్రహ్మణ్యం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు చీఫ్ గెస్ట్‌గా అల్లు అర్జున్ హాజరయ్యారు. ఈ సందర్భంగా అల్లు అర్జున్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి.అల్లు మాట్లాడుతూ.. 'మై డియర్ ఫ్యాన్స్.. మీరే నా ఆర్మీ, నా ఫ్యాన్స్ అంటే నాకు పిచ్చి. హీరోని చూసి చాలామంది ఫ్యాన్స్ అవుతారు, కానీ నేను నా ఫ్యాన్స్‌ని చూసి హీరోనయ్యా. నా నుంచి కొత్త సినిమా వచ్చి మూడేళ్లయినా మీరు చూపే ప్రేమ అస్సలు తగ్గలే. నన్ను ప్రేమించే వాళ్ల కోసం నిలబడగలగాలి. మన అనుకున్న వాళ్ల కోసం ఎంత వరకైనా వెళ్తా.. అది మీ అందరికి తెలుసంటూ కామెంట్ చేశారు. అల్లు అర్జున్ ఈ వ్యాఖ్యలు మెగా ఫ్యామిలీని ఉద్దేశించి చేశారనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.ఇదిలావుండగా సోషల్ మీడియా లో ఇప్పుడు ఎక్కడ చూసినా అల్లు అర్జునే కనిపిస్తున్నాడు. ఆయన 'మారుతీ నగర్ సుబ్రహ్మణ్యం' చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ముఖ్య అతిథి గా హాజరయ్యాడు. ఈ వేడుకల్లో అల్లు అర్జున్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. గతంలో చిరంజీవి వల్లే తాను హీరో అయ్యానని చెప్పిన బన్నీ ఈవెంట్ లో మాత్రం ఫ్యాన్స్ వల్ల హీరో అయ్యానని చెప్పారు. దీంతో ఆయన మాటలు మార్చారని మెగా ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. చిరంజీవి బర్త్‌డే సందర్భంగా రిలీజ్ అయిన ఇంద్రాలోని గిరి పాత్రతో బన్నీని పోల్చుతున్నారు. దీంతో థియేటర్లలో ఆయన పేరు మారుమోగుతుంది.