మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే సందర్భంగా అభిమానులకు కన్నుల పండగ జరిగేలా ఆయన కొత్త సినిమా విశ్వంభర టీజర్ రిలీజ్ చేశారు చిత్ర యూనిట్. ఇక రిలీజ్ అయిన కొద్ది క్షణాల్లోనే విశ్వంభర టీజర్ సోషల్ మీడియాలో చాలా వైరల్ అయింది.ఈ టీజర్ లో చిరంజీవి త్రిశూలం పట్టుకొని ఉన్నారు.అయితే తాజాగా చిరంజీవి విశ్వంభర టీజర్ వివాదంలో ఇరుక్కున్నట్టు తెలుస్తుంది. చాలామంది హిందువులు విశ్వంభర టీజర్ పై మండిపడుతున్నారు. మా హిందువుల మనోభావాలు దెబ్బతీశారు అంటూ ఫైర్ అవుతున్నారు.మరి ఇంతకీ విశ్వంభర టీజర్ లో ఉన్న తప్పేంటి.. హిందువులు ఎందుకు అంతలా ఫైర్ అవుతున్నారు అనేది ఇప్పుడు చూద్దాం.. మెగాస్టార్ బర్త్ డే సందర్భంగా ఇంద్ర మూవీని రీ రిలీజ్ చేయడంతో పాటు మెగాస్టార్ చిరంజీవి కొత్త మూవీ విశ్వంభర టీజర్ కూడా విడుదల చేశారు.
అయితే విశ్వంభర టీజర్ చూస్తే మెగా ఫ్యాన్స్ కి పూనకాలు వచ్చాయి.అంతేకాదు సరికొత్త లోకానికి చిరంజీవి ఈ మూవీతో తీసుకువెళ్తారని ఎంతోమంది ఈ సినిమాపై భారీ హోప్స్ పెట్టుకున్నారు.అయితే టీజర్ కి మంచి రెస్పాన్స్ వస్తున్న సమయంలో ఈ టీజర్ ఓ వివాదంలో ఇరుక్కుంది. అదేంటంటే.. చిరంజీవి త్రిశూలం పట్టుకున్న ఈ టీజర్ లో చెప్పులు వేసుకుని ఉన్నాడని, చెప్పులు వేసుకుని దేవుడి త్రిశూలం ఎలా పట్టుకుంటారని కొంతమంది హిందువులు చిరంజీవి పై చిత్ర డైరెక్టర్ పై ఫైర్ అవుతున్నారు..
అయితే దేవుడికి సంబంధించిన సినిమాలు చేస్తే ఏదో ఒక సన్నివేశంలో పొరపాటు తప్పనిసరిగా చేస్తారు. వాటిని సరిదిద్దుకొని సినిమాలు జాగ్రత్తగా తెరకెక్కిస్తేనే బాగుంటుంది. అంతేకానీ ఏ ఒక్కచోట చిన్న తప్పు చేసినా కూడా హిందువుల మనోభావాలు దెబ్బతీసినట్టు అవుతుంది. అయితే చాలా వరకు సినిమాలు ఇలాంటి కాంట్రవర్సీలలో ఇరుక్కుంటే సినిమాకి మరింత హైప్ పెరిగి బ్లాక్ బస్టర్ హిట్స్ అవుతాయి. మరి టీజర్ కాంట్రవర్సీ విశ్వంభర కు ఏమైనా పనికి వస్తుందా లేదా చూడాలి