శోభిత రాక.... అక్కినేని-దగ్గుబాటి కుటుంబాల మధ్య గొడవలు?
నాగచైతన్య సమంతను పెళ్లి చేసుకోవడం ఆమెకు చాలా ఇష్టం. అంతేకాదు ఆమె సమంతను బాగా ఇష్టపడుతుంది. విడాకులు తీసుకుని శోభితతో ఎంగేజ్మెంట్ జరుపుకున్నప్పటికీ సమంతతో దగ్గుబాటి లక్ష్మి ఇప్పటికీ మాట్లాడుతున్నారట. సమంతను ఆమె తన కోడలిగా మనస్ఫూర్తిగా ఇష్టపడిందని, అందుకే రీసెంట్గా జరిగిన ఎంగేజ్మెంట్ కు హాజరు కాలేదని పేర్కొన్నారు.
సమంతకు మయోసైటిస్ వ్యాధి సోకినప్పుడు లక్ష్మి ఎంతో బాధ పడిందట. ఎప్పటి కప్పుడు సమంత బాగోగులను ఫోన్ చేసి తెలుసుకునేదని టాక్. సమంతతో విడాకుల తర్వాత నాగచైతన్యతో మాట్లాడడం కాస్త తగ్గించిందట లక్ష్మి. ఇక జరగ బోయే పెళ్లికైనా లక్ష్మి వస్తుందా లేదా అనే సందేహం ప్రతి ఒక్కరిని వెంటాడుతోంది. ఇది ఇలా ఉంండగా... అక్కినేని నాగార్జున కుమారుడు నాగచైతన్య, శోభిత ధూళిపాళతో పెళ్లి ఇటలీలో జరుగనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ ఏడాది చివర్లో నాగచైతన్య, శోభిత ధూళిపాళతో పెళ్లి జరుగనుందని సమాచారం.