తాజాగా తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం హైడ్రా పేరిట అక్రమ ఆస్తులున్నింటిని కూల్చివేస్తోంది.ఎక్కడైతే అక్రమంగా కట్టిన కట్టడాలు ఉన్నాయో వాటిని బుల్డోజర్లతో కూల్చివేస్తుంది. ఇక ఈ లిస్టులో ఎంత పెద్ద సెలబ్రిటీ అయినా ఉండని ఎంత పెద్ద రాజకీయ నాయకుడైనా ఉండని అక్రమంగా ఉన్న వాటన్నింటిని తొలగిస్తోంది. అయితే తాజాగా అక్కినేని నాగార్జున ఎన్ కన్వెన్షన్ సెంటర్ ని హైడ్రా కూల్చివేసింది.భారీ పోలీసుల బందోబస్తు మధ్య ఈరోజు ఉదయం ఎన్ కన్వెన్షన్ సెంటర్ ని పూర్తిగా కూల్చి వేస్తున్నారు.అయితే నాగార్జునకి సంబంధించిన ఈ ఎన్ కన్వెన్షన్ సెంటర్ తుమ్మిడి కుంట చెరువులోని మూడున్నర ఎకరాల స్థలానికి కబ్జా చేసి కట్టారనే ఆరోపణలు గతంలోకి వచ్చాయి. దాంతో హైడ్రా ఈ అక్రమ నిర్మాణాన్ని కూల్చేస్తుంది. అయితే ఈ విషయం నాగార్జునకి తెలియడంతోనే రీసెంట్ గా రేవంత్ రెడ్డిని సీక్రెట్ గా నాగార్జున కలిశారట.కానీ రూల్స్ ప్రకారమే వెళ్తామని రేవంత్ సర్కార్ తేల్చి చెప్పడంతో నాగార్జున సైలెంట్ గా వచ్చేసారట.
ఇప్పటికే గండిపేటలో ఉన్న ఎంతోమంది ప్రముఖుల అపార్ట్మెంట్లు,ఐఓసి బిల్డింగులు, ఫామ్ హౌస్ లు వంటివి కూల్చివేశారు.ఇక గండిపేటలో కాంగ్రెస్ కు సంబంధించిన ఎంతోమంది రాజకీయ నాయకుల ఫామ్ హౌస్ లను కూడా కూల్చివేశారు.అయితే తాజాగా నాగార్జున ఎన్ కన్వెన్షన్ సెంటర్ ని కూల్చివేయడంతో సోషల్ మీడియాలో ఒక రచ్చ జరుగుతుంది. అదేంటంటే.. శోభిత ఎంట్రీ ఇచ్చింది నాగార్జున ఆస్తులు ఢమాల్ అవుతున్నాయి అంటూ ఒక పోస్ట్ నెట్టింట వైరల్ అవుతుంది. అయితే రీసెంట్ గానే నాగచైతన్య తో శోభిత ఎంగేజ్మెంట్ జరిగింది..
దీంతో నాగార్జున ఆస్తి అయినటువంటి ఎన్ కన్వెన్షన్ సెంటర్ ని కూల్చివేయడంతో శోభిత ఎంట్రీ ఇవ్వడంతో నాగార్జున ఆస్తులు పోతున్నాయని, శోభిత అక్కినేని ఫ్యామిలీలోకి ఎంట్రీ శుభశకునం కాదని.. ఆమె ఓ ఐరన్ లెగ్ అంటూ సోషల్ మీడియాలో కొంతమంది నెటిజన్స్ షాకింగ్ పోస్టులు పెడుతున్నారు.. ఇక కొత్త కోడలు రాకతో మామ నాగార్జున ఆస్తులు పోతున్నాయంటూ సోషల్ మీడియాలో ట్రోల్స్,మీమ్స్ చేయడంతో ఈ వార్త కాస్తా నెట్టింట్లో వైరల్ గా మారింది.ఇక నాగార్జున కి సంబంధించిన ఎన్ కన్వెన్షన్ సెంటర్లో ఎంతోమంది సెలబ్రిటీలు పెళ్లిళ్లు, రిసెప్షన్ పార్టీలు, బర్త్డే పార్టీలు చేసుకునేవాళ్లు. అయితే సడన్ గా కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమ కట్టడాలపై హైడ్రా పేరుతో ఉక్కు పాదం మోపింది. దీంతో నాగార్జునకి షాక్ తగిలినట్టు అయింది