సినిమా విజయంలో ఆ మూవీ రన్ టైమ్ అనేది ఎంతో కీలకపాత్రను పోషిస్తూ ఉంటుంది. ఎందుకు అంటే కొన్ని సినిమాలు మొదట భారీ రన్ టైం తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆ రన్ టైం ఆ సినిమాకు పర్ఫెక్ట్ కాదు అని జనాలు భావించినట్లు అయితే ఆ సినిమాపై నెగటివ్ ప్రభావం పడే అవకాశం ఉంటుంది. అలా ఈ మధ్య కాలంలోనే విడుదల అయిన తర్వాత ఆ సినిమా రన్ టైమ్ ఆ మూవీ టాక్ పై ప్రభావాన్ని చూపడంతో రన్ టైం ను తగ్గించిన సినిమాలు కూడా అనేకం ఉన్నాయి. దానితో చాలా మంది మూవీ మేకర్స్ సినిమా రన్ టైం ఎక్కువగా కాకుండా , మరి తక్కువగా కాకుండా ఉండేలా చూసుకుంటూ ఉంటారు. ఇక ఎక్కువ రన్ టైం తో వచ్చిన సినిమాలలో కంటెంట్ ఫుల్ గా ఉంటేనే ప్రేక్షకులు సాటిస్ఫై అవుతారు. లేదంటే ప్రేక్షకులు సినిమాకు డిస్కనెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇకపోతే మరికొన్ని రోజుల్లో విడుదల కాబోయే ఓ రెండు సినిమాల రన్ టైం తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. ఆ సినిమాలు ఏవో తెలుసుకుందాం.
నాచురల్ స్టార్ నాని హీరోగా ప్రియాంక అరుణ్ మోహన్ హీరోయిన్ గా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో సరిపోదా శనివారం అనే మూవీ రూపొందిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ ని ఆగస్టు 29 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ మూవీ ఏకంగా 2 గంటల 50 నిమిషాల భారీ నడివితో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో ఎస్ జె సూర్య విలన్ పాత్రలో నటించాడు. తలపతి విజయ్ ప్రస్తుతం ది గోట్ అనే సినిమాలో హీరోగా నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఈ సినిమా ఏకంగా 2 గంటల 59 నిమిషాల 39 సెకండ్ల భారీ నిడివితో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు తెలుస్తోంది. ఇలా ఈ రెండు సినిమాలు అత్యంత భారీ నిడివితో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు తెలుస్తోంది. మరి ఈ సినిమాల రిజల్ట్ ఏ విధంగా ఉంటుందో చూడాలి.