కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ప్రస్తుతం కంగువ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, గ్లింప్స్ మూవీపై అంచనాలను పెంచేశాయి. త్వరలోనే ఈ మూవీ అడియన్స్ ముందుకు రాబోతుంది. ఈ సినిమాతో సూర్య మరో భారీ విజయం అందుకుంటాడని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. తమిళంతోపాటు తెలుగులోనూ ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. అలాగే డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో మరో కొత్త ప్రాజెక్ట్ కూడా స్టార్ట్ చేశాడు.అంతలోనే సూర్య అభిమానుల్ని మరో బహుమతితో అభిమానుల్ని సర్ ప్రైచ్ చేసినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే..ఇటీవల కొద్దిరోజులుగా సూర్యకు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరలవుతుంది.సూర్య సొంతంగా ఓ ప్రైవేట్ జెట్ కొనుగోలు చేసినట్లు టాక్ వినిపిస్తుంది. అత్యంత అనుకూలమైన డస్సాల్డ్ ఫాల్కర్ 2000 జెట్‌ను సూర్య కొనుగోలు చేసినట్లు నెట్టింట ప్రచారం జరుగుతోంది.ఆ జెట్ ధర రూ.120 కోట్లు అని, కొన్ని అత్యాధునిక సాంకేతికత, భద్రతా సౌకర్యాలు ఈజెట్ లో ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ తరహా జెట్ లు కొందరు కలిగి ఉన్నారు.
రజనీకాంత్, విజయ్ లు సొంత విమానాలు కలిగి ఉన్నారు. అలాగే నయనతార కూడా ఓ జెట్ ని కలిగి ఉంది. ఇప్పుడు వాళ్ల సరసన సూర్య చేరుతున్నట్లు కనిఇస్తుంది. అయితే విషయాన్ని సూర్య కన్పమ్ చేయాల్సి ఉంది.అయితే సూర్య సన్నిహిత వర్గాల నుంచి మాత్రం ఆయన ఎలాంటి జెట్ కొనలేదని మరో వార్త కూడా వైరల్ అవుతుంది. మరి ఈ ప్రచారంలో అసలు నిజం ఏంటి అన్నది తేలాల్సి ఉంది.ఈ జెట్ అత్యాధునిక సాంకేతికత మరియు భద్రతా లక్షణాలతో రూపొందించబడింది, సూర్య 'తన షెడ్యూల్‌ను నిర్వహించడంలో మరియు సినిమా స్థానాలకు సమర్థవంతంగా ప్రయాణించడంలో' సహాయపడటానికి ఉద్దేశించబడింది . ఈ వార్త త్వరగా వ్యాపించి చర్చనీయాంశంగా మారింది,తమిళ ఇండస్ట్రీలో ఇప్పటికే నయనతార, రజినీకాంత్, విజయ్ సొంత విమానాన్ని కలిగి ఉండగా, ఇప్పుడు ఆ జాబితాలో సూర్య చేరారు. సూర్య ప్రస్తుతం ‘కంగువా’ సినిమాలో నటిస్తున్నారు.సూర్య నటించిన కంగువ సినిమా అక్టోబర్ 10, 2024న థియేటర్లలోకి రానుంది. ఇక అదే రోజున రజినీకాంత్ నటించిన వేట్టైయాన్ సినిమా కూడా రిలీజ్ కానుంది. దీంతో బాక్సాఫీస్ వద్ద సూర్య వర్సెస్ రజినీ మధ్య పోటీ ఉండనుంది. కంగువ చిత్రంలో బాబీ డియోల్, దిశా పటాని, యోగి బాబు, జగపతి బాబు తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు.నటుడిగా సూర్యకిది 44వ చిత్రం.