మెగాస్టార్
చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర అనే సినిమాలో
హీరో గా నటిస్తున్నాడు. ఈ
మూవీ చిరు కెరియర్లో 156
మూవీ గా రూపొందుతుంది. ఇకపోతే పోయిన సంవత్సరం
చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా చిరు "సోగ్గాడే చిన్నినాయన"
సినిమా దర్శకుడు అయినటువంటి
కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో ఓ
మూవీ చేయబోతున్నట్లు ప్రకటించాడు. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. కానీ ఆ తర్వాత ఏమైందో ఏమో తెలియదు కానీ ఈ సినిమాకు సంబంధించిన ఎలాంటి అప్డేట్ బయటకు రాలేదు.
ఇక ఈ
సినిమా క్యాన్సిల్ అయినట్లు చాలా మంది ఫిక్స్ అయిపోయారు.
చిరంజీవి కేవలం విశ్వంభర మూవీలోని నటిస్తూ తన నెక్స్ట్
మూవీ కి సంబంధించిన అప్డేట్ మాత్రం ఆ తర్వాత ప్రకటించలేదు. ఆగస్టు 22 వ తేదీన
చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా తన నెక్స్ట్
మూవీ కి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉన్నట్లు వార్తలు వచ్చాయి. కానీ చిరు పుట్టిన రోజు సందర్భంగా ఆయన నెక్స్ట్
మూవీ కి సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఇక ప్రస్తుతం
చిరంజీవి "విశ్వంభర"
మూవీ పై ఫుల్ కాన్సన్ట్రేషన్ పెట్టినట్లు తెలుస్తోంది.
ఆ సినిమాపై
చిరంజీవి చాలా నమ్మకంగా ఉన్నట్లు దానితో ఇప్పటికే ఆ
మూవీ ని వచ్చే సంవత్సరం
సంక్రాంతి పండుగ కానుకగా
జనవరి 10 వ తేదీన విడుదల చేయడానికి కమిట్ అయి ఉండడంతో దానిని పూర్తి చేసిన తర్వాత వేరే
సినిమా గురించి ఆలోచించాలి అనే
చిరంజీవి అనుకుంటున్నట్లు , అందుకే మెగా 157 గురించి పెద్దగా పట్టించుకోవడం లేదు అని విశ్వంభర
మూవీ షూటింగ్ పూర్తి కాగానే చిరు తన కెరీర్ లో 157
మూవీ పై ఫుల్ కాన్సన్ట్రేషన్ పెట్టబోతున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే విశ్వంభర మూవీబ్లో
త్రిష హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ... ఎం ఎం
కీరవాణి ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాకు మల్లాడి వశిష్ట దర్శకత్వం వహిస్తున్నాడు.