కోలీవుడ్ డైరెక్టర్ కమ్ నటుడు ఎస్జే సూర్య ప్రస్తుతం హైప్రొఫైల్ సినిమాల్లో నటిస్తున్నాడు. అతను ఇప్పటికే విలన్ పాత్రల్లోనూ, అసాధారణ పాత్రలలోనూ నటించి పాపులారిటీ సంపాదించాడు. ఇటీవల "భారతీయుడు 2" లో కనిపించాడు సూర్య. ప్రస్తుతం రామ్ చరణ్ లేటెస్ట్ మూవీ "గేమ్ ఛేంజర్" లో ప్రధాన ప్రతినాయకుడిగా నటిస్తున్నాడు. లేటెస్ట్ గా "సర్దార్ 2" సెట్స్ లో జాయిన్ అయ్యాడు.ఇదిలావుండగా ఎస్ జే సూర్య మీడియాతో మాట్లాడే మాటలు, స్టేజ్ మీద ఇచ్చే స్పీచులు ఎంతగా వైరల్ అవుతున్నాయో అందరికీ తెలిసిందే. సరిపోదా శనివారం గురించి మాట్లాడిన ప్రతీ సారి ఒకే మాటను వినిపిస్తున్నాడు. సరిపోదా శనివారం చాలా కొత్తగా ఉంటుందని.. శనివారం మాత్రం బాషా అని.. మిగతా అన్ని రోజులు మాణిక్యం అని.. ఆ మూవీ ఎలా ఉంటుందో హింట్ ఇచ్చేశాడు. శనివారం మాత్రమే తన కోపాన్ని ప్రదర్శించే హీరో పాత్ర చుట్టూ కథ తిరుగుతుందని చెప్పుకొచ్చాడు. అలా సినిమా మెయిన్ థీమ్‌ను చెప్పేశాడు.ఇక తాజాగా జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఎస్ జే సూర్య మాట్లాడిన మాటలు వైరల్ అవుతున్నాయి. యాక్షన్ జానర్లో ఏ సినిమా తీసినా అది మాణిక్ బాషా నుంచి తీసుకున్నదే అంటూ చెప్పుకొచ్చాడు. బాలయ్య చిత్రాలు, చిరు ఇంద్ర మూవీ కూడా ఆ కాన్సెప్ట్లోంచే తీసుకున్నదే అని అన్నాడు. ఇక బాహుబలి 2 కూడా మాణిక్ బాషా నుంచే వచ్చిందంటూ చెప్పుకొచ్చాడు. కానీ సరిపోదా శనివారం మాత్రం ఆ ఫార్మాట్లోనే ఉంటూ సరికొత్తగా రాసుకున్నాడని వివేక్ ఆత్రేయ గురించి ఎస్ జే సూర్య చెప్పుకొచ్చాడు.ఈ కథను వివేక్ చెప్పినప్పుడు ఎంతో థ్రిల్‌కు గురయ్యాడట. కథను చెప్పిన వెంటనే ఓకే చేశాడట. వివేక్ ఆత్రేయ చాలా కొత్తగా ఈ కథను రాసుకున్నాడట. ఓ కారణంతో శనివారం మాత్రమే కోపాన్ని ప్రదర్శించే పాత్ర అని చెప్పుకొచ్చాడు. మేం ఎంత సరదాగా షూట్ చేశామో.. ఎంత ఎంజాయ్ చేశామో.. ఆడియెన్స్ కూడా అంతే ఎంజాయ్ చేస్తుంటారు. కానిస్టేబుల్ డ్రెస్సులోనూ చాలా అందంగా ఉన్నారు.. ప్రెట్టి ప్రియాంక అంటూ పొగిడేశాడు ఎస్ జే సూర్య.
మొదటి రెండు టేక్స్‌లోనే షాట్ ఓకే అవుతుంది.. ప్రియాంక చాలా మంచి నటి అని ఎస్ జే సూర్య చెప్పుకొచ్చాడు. ఈ ఏడాది మాకు శనివారం బాగా కలిసి వచ్చింది.. నాని బర్త్ డే, నా బర్త్ డే , సాయి కుమార్ బర్త్ డే అన్నీ కూడా శనివారమే వచ్చాయని అన్నాడు.