బాలీవుడ్ స్టార్
హీరో అక్షయ్ కుమార్ ఈ మధ్యకాలంలో వరుస ఫ్లాప్ సినిమాలను ఎదుర్కొంటూ ఫ్లాప్ స్టార్ గా మారిపోయాడు. అయితే ఈయన ఎన్ని ఫ్లాప్ సినిమాల్లో నటించినా కూడా అవకాశాలు మాత్రం తగ్గడం లేదు. వరుస అవకాశాలు వస్తూ ఇండస్ట్రీలో బిజీయెస్ట్ ఆర్టిస్టుగా
అక్షయ్ కుమార్ దూసుకుపోతున్నారు. అయితే అలాంటి
హీరో ట్వింకిల్ ఖన్నా కంటే ముందే మరో
హీరోయిన్ ని
పెళ్లి చేసుకుంటానని చెప్పి ఆ పని కూడా చేశారట.ఇక ఆ
హీరోయిన్ ఎవరు.. ఇంతకీ
అక్షయ్ కుమార్ చేసిన పని ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం..
అక్షయ్ కుమార్ ట్వింకిల్
కన్నా కంటే ముందే
బాలీవుడ్ బ్యూటీ
రవీనా టాండన్ ని
పెళ్లి చేసుకోవాలి అనుకున్నారట.. వీరిద్దరి కి నిశ్చితార్థం కూడా జరిగింది. కానీ పెళ్లయితే జరగలేదు.. దీనికి కారణం కూడా ట్వింకిల్
కన్నా అంటుంటారు కొంతమంది
బాలీవుడ్ జనాలు..
రవీనా టాండన్ తో ప్రేమలో ఉన్న
అక్షయ్ కుమార్ ట్వింకిల్ కన్నాతో కూడా సీక్రెట్ గా ప్రేమాయణం కొనసాగించాడని, కానీ ఈ విషయం
రవీనా టాండన్ పసిగట్టలేదని తెలుస్తోంది.
అలాగే రవీనా ని
పెళ్లి చేసుకుంటానని ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్నారట.కానీ చివరికి వీరి ఎంగేజ్మెంట్ బ్రేక్ అయ్యి ట్వింకిల్ కన్నాతో
పెళ్లి జరిగింది. అలా
పెళ్లి వరకు వెళ్లిన
అక్షయ్ కుమార్,
రవీనా టాండన్ లు విడిపోయారు. అయితే ఇదే విషయాన్ని రీసెంట్గా
రవీనా టాండన్ ఓ పాడ్ కాస్ట్ లో మాట్లాడుతూ.. అవును మాకు ఎంగేజ్మెంట్ జరిగింది నిజమే. చాలా రోజులు ఇది సీక్రెట్ గా ఉంది.కానీ ఎంగేజ్మెంట్
పెళ్లి వరకు దారి తీయలేదు. మధ్యలోనే బ్రేక్ అయింది.కానీ ఈ విషయం జరిగి చాలా సంవత్సరాలు అవుతున్న్ కూడా చాలామంది ఇంకా నా తలపై దాన్ని రుద్దుతూనే ఉన్నారు.
ఎంతోమంది
పెళ్లి అయిన వాళ్ళు కూడా విడాకులు తీసుకొని ముందుకు అడుగులు వేస్తున్నారు. కానీ నన్ను మాత్రం ఈ విషయంలో ప్రతిసారి వేధిస్తూనే ఉన్నారు. ఇక మా
పెళ్లి జరగపోయినప్పటికీ ఇప్పటికీ మేం ఫ్రెండ్లీగా మాట్లాడుకుంటూనే ఉంటాం అంటూ
రవీనా టాండన్ చెప్పుకొచ్చింది.ఇక ప్రస్తుతం రవినా టాండన్
అక్షయ్ కుమార్ కాంబినేషన్లో ప్రస్తుతం వెల్కమ్ ది జంగిల్ అనే
సినిమా వస్తుంది