టాలీవుడ్ ఇండస్ట్రీ లో అద్భుతమైన గుర్తింపు కలిగిన దర్శకులలో రాజమౌళి ఒకరు. ఇకపోతే రాజమౌళి ఇప్పటివరకు ఎన్నో సినిమాలకు దర్శకత్వం వహించాడు. అందులో అన్నీ కూడా బ్లాక్ బాస్టర్ విజయాలను సాధించడంతో ఈయనకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు లభించింది. ఇకపోతే ఈయనతో ఏ నిర్మాత సినిమా తీసిన వారికి అద్భుతమైన లాభాలు వచ్చాయి. కొన్ని సంవత్సరాల క్రితం రాజమౌళి , మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా కాజల్ హీరోయిన్ గా మగధీర అనే మూవీ సినిమాను తెరకెక్కించాడు. ఈ మూవీ ని గీత ఆర్ట్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ఎంతో భారీ బడ్జెట్ తో నిర్మించాడు.
ఈ సినిమా సూపర్ సక్సెస్ అయ్యింది అద్భుతమైన లాభాలు ఈ మూవీ ద్వారా అరవింద్ కి వచ్చాయి. ఇది ఇలా ఉంటే రాజమౌళి ఓ ఇంటర్వ్యూ లో భాగంగా మగధీర నిర్మాత అయినటువంటి అల్లు అరవింద్ పై ఒక చిన్న విషయంలో కోపం వచ్చింది అని చెప్పుకొచ్చాడు. అసలు రాజమౌళి కి అరవింద్ పై ఎందుకు కోపం వచ్చింది అనే వివరాల్లోకి వెళితే ... రాజమౌళి ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ ... చాలా మంది హీరోలకు సంబంధించిన సినిమాలు మంచి విజయాలను అందుకున్న సందర్భంలో కూడా 100 డేస్ , సెంటర్స్ 175 డేస్ సెంటర్స్ విషయంలో వారు కొన్ని తప్పు ధియేటర్లను చూపిస్తూ ఉండేవారు. మగధీర సినిమా చేస్తున్న సమయంలో ఈ డిస్కర్షన్ అరవింద్ గారితో వచ్చింది. దానితో మేమిద్దరం అలా అస్సలు ఆ సినిమాకు చేయొద్దు అని అనుకున్నాం.
సినిమా విడుదల అయింది. అద్భుతమైన హిట్ అయింది. ఇండస్ట్రీ హెడ్ కి డబల్ కలెక్షన్లను ఆ మూవీ వసూలు చేసింది. అలా అద్భుతమైన కళాశాలను వసూలు చేస్తూ థియేటర్లలో ప్రదర్శించబడుతున్న సమయంలో 100 డేస్ థియేటర్లను పెంచడం మొదలు పెట్టారు. ఏంటి సార్ ఇలా వద్దు అనుకున్నాం కదా అని అరవింద్ గారిని అడిగాను. దానితో ఆయన వద్దు అనుకున్నాం ... కానీ ఫ్యాన్స్ తో ఎలా ఉంటుందో నీకు తెలుసు కదా. ఏమీ అనుకోకు అని అన్నాడు. ఆ విషయంలో అరవింద గారిపై చిన్న కోపం వచ్చింది తప్ప అది పెద్ద సీరియస్ మేటర్ కాదు అని రాజమౌళి తాజాగా చెప్పుకొచ్చాడు.