టాలీవుడ్ హీరో మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ చిత్రం ‘కన్నప్ప’. అయితే ఇందులో సౌత్, నార్త్‌లో ఉన్న బడా స్టార్స్‌ను భాగం చేశాడు. అంతేకాకుండా మంచు విష్ణు కూడా ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు. అలాగే ఇందులో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, మోహన్ లాల్, శరత్ కుమార్, బ్రహ్మానందం, ప్రీతి ముకుందన్, కాజల్ అగర్వాల్, మధుబాల, మోహన్ బాబు, దేవరాజ్ వంటి నటీనటులు నటిస్తున్నారు. అయితే ఈ చిత్రాన్ని ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తుండగా.. అవా ఎంటర్టైన్మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్స్‌పై మోహన్ బాబు నిర్మిస్తున్నాడు.నటుడు మంచు విష్ణు కన్నప్ప సినిమాతో బిజి బిజిగా ఉన్నాడు. అయితే, ఈ సినిమా కోసం ఆయన చాలారోజుల నుంచి కృషి చేస్తున్నారు. భారీ బడ్జెట్ మూవీ తో తెరకెక్కుతున్న చిత్రం కన్నప్ప. ఈ సినిమాలో పెద్ద పెద్ద స్టార్స్నందరినీ తీసుకున్నారు. అయితే, ఇదే సినిమాతో విష్ణు కొడుకు కూడా ఎంట్రీ ఇవ్వనున్నాడు. శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా సోమవారం కన్నప్ప నుంచి ఓ పోస్టర్ విడుదలయ్యింది. అది ఎవరిదో కాదు. మంచు విష్ణు కొడుకు అవ్రమ్ మంచు ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. ఈ సినిమాలో అవ్రమ్ తిన్నడు పాత్రలో కనిపించనున్నాడు.
ఈ తిన్నడే పెద్దయ్యాక భక్త కన్నప్పగా మారనున్నాడు. అయితే, కొడుకు సినీ ఎంట్రీపై మంచు విష్ణు ఎమోషనల్ అయ్యాడు.ఈ సందర్భంగా మంచు విష్ణు సోషల్ మీడియాలో ఓ ఎమోషనల్ పోస్ట్ షేర్ చేశాడు.‘‘జన్మాష్టమి శుభాకాంక్షలు.. కన్నప్ప సినిమాలో నా అవ్రామ్ తిన్నడు పాత్రలో నటిస్తున్నాడు.
అతను పెద్దయ్యాక ఈ తిన్నడే భక్త కన్నప్పగా మారుతాడు. ఫస్ట్ లుక్ లాంచ్ చేయడం గర్వంగా ఉంది. ఈ ప్రపంచానికి తను నటుడిగా పరిచయం అవుతున్నందుకు మాటలు రావడం లేదు. అతన్ని నటుడిగా చూడటం పట్ల మాటల్లో చెప్పలేనంత ఉత్సాహం ఉంది’’ అని రాసుకొచ్చాడు. అయితే అవ్రామ్ లుక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అందులో అమ్మవారి ముందు నిల్చున్న పవర్ ఫుల్ లుక్ అందరినీ ఆకట్టుకుంటుంది.ఇక, కన్నప్ప సినిమా గురించి చూస్తే... ఈ సినిమాకు ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈయన గతంలో మహాభారత్' సిరీస్‌కు దర్శకత్వం వహించారు.ఇది ఒక పాన్ ఇండియా సినిమా. ఈ సినిమాలో మంచు విష్ణు కన్నప్ప రోల్ ప్లే చేస్తున్నాడు. కన్నప్పలో మోహన్ బాబు, ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్ లాల్, శరత్ కుమార్, కాజల్ అగర్వాల్, మధుబాల, బ్రహ్మానందం, ప్రీతి ముకుందన్ , దేవరాజ్ వంటి పెద్ద పెద్ద స్టార్స్ందరూ నటిస్తున్నారు. ఈ సినిమా ఒక్క తెలుగులోనే కాకుండా తమిళ మళయాళ, కన్నడ, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో కూడా విడుదల కానుంది.