కోలీవుడ్ హీరో విజయ్ కి స్టార్ హీరోయిన్ త్రిషకి మధ్య సంథింగ్ ఏదో నడుస్తుంది అనే టాక్ వీరిద్దరి కాంబినేషన్లో లియో మూవీ వచ్చినప్పటి నుండి ప్రచారం జరుగుతూనే ఉంది. అయితే ఈ జంట మొదటిసారి గిల్లి అనే మూవీలో నటించారు.అప్పటినుండి వీరి మధ్య ఈ లవ్ రూమర్స్ చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. అంతేకాదు గతంలో ప్రభాస్ త్రిషలు పెళ్లి దాకా వెళ్లి విజయ్ తో త్రిషకి ఉన్న అనుబంధం కారణంగానే ప్రభాస్ త్రిషని వదిలేసాడు అనే టాక్ కూడా ఇండస్ట్రీలో ఉంది. అయితే త్రిష విజయ్ ల మధ్య చాలా సంవత్సరాలు ప్రేమాయణం నడిచిందని, కానీ ఇది నచ్చని విజయ్ తండ్రి ఎస్.ఏ. చంద్రశేఖర్ వీరి పెళ్లికి ఒప్పుకోలేదని తెలుస్తోంది. ఆ తర్వాత విజయ్ సంగీతని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయితే విజయ్ లియో సినిమాలో మళ్లీ త్రిష కలిసి నటించినప్పటి నుండి సంగీతకి విజయ్ కి మధ్య దూరం పెరిగిందని, వీరిద్దరి మధ్య తరచూ గొడవలు వస్తున్నాయనే టాక్ కోలీవుడ్లో ప్రచారం అవుతుంది.
అంతేకాకుండా రీసెంట్గా విజయ్ త్రిష రొమాంటిక్ వెకేషన్ కి వెళ్ళినట్టు కూడా కొన్ని ఫొటోస్ మీడియాలో వైరల్ అయ్యాయి. అలాగే వీళ్ళిద్దరూ వేర్వేరుగా షేర్ చేసిన ఫొటోస్ ని బట్టి వీరిద్దరూ ఒకే దగ్గరికి వెకేషన్ కి వెళ్లారని అందరూ భావించారు. దీంతో వీరిద్దరి మధ్య రిలేషన్ ఉందని అందరూ నమ్మారు.అయితే వీరిద్దరి మధ్య ఉన్న రిలేషన్ నిజమేనని చెప్పడానికి మరొక మ్యాటర్ వైరల్ అవుతుంది. అదేంటంటే ప్రస్తుతం విజయ్ గోట్ మూవీలో చేస్తున్న సంగతి మనకు తెలిసింది.అయితే ఈ సినిమాలో త్రిష ఐటెం సాంగ్ చేస్తుందని స్వయంగా డైరెక్టర్ వెంకట్ ప్రభు ఈ విషయాన్ని బయట పెట్టారు. కానీ త్రిష ఈ సినిమాలో ఐటెం సాంగ్ చేస్తుందని చెప్పకుండా స్పెషల్ అప్పీరియన్స్ అంటున్నారు. అయితే స్టార్ హీరోయిన్గా అవకాశాలు తగ్గాక త్రిష దగ్గరికి ఐటెం సాంగ్ చేయమని ఎంతోమంది పెద్దపెద్ద దర్శకులు వచ్చారు.
కానీ ఎవరికీ కూడా ఆమె ఓకే చెప్పలేదు. అయితే ఫస్ట్ టైం త్రిష విజయ్ గోట్ సినిమాలో ఐటెం సాంగ్ చేయడానికి ఒప్పుకుందంటే వీరిద్దరి మధ్య ఏదో బలమైన రిలేషనే ఉందని,అందుకే ఇప్పటివరకు త్రిష ఎవరితో కూడా ఐటమ్ సాంగ్ చేయలేదు.కానీ విజయ్ తో చేయడానికి రెడీ అయిందని పలువురు నెటిజన్లు భావిస్తున్నారు.ఇక త్వరలోనే ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెడుతున్న విజయ్ జీవితంలో ఇలాంటి రూమర్స్ ఆయన రాజకీయ జీవితాన్ని కాస్త దెబ్బ కొట్టే అవకాశం ఉందని ఆయన అభిమానులు భావిస్తున్నారు. మరి చూడాలి త్రిష విజయ్ ల వ్యవహారం ఇంకా ఎక్కడి వరకు దారితీస్తుందో.