బాలీవుడ్లోని టాప్ హీరోల్లో ఒకడు, ముగ్గురు ఖాన్లలో ఒకడైన అమీర్ ఖాన్.. తన లాస్ట్ మూవీ ‘లాల్ సింగ్ చద్దా’ ప్లాప్పై ఇన్నాళ్లకు పెదవి విప్పారు.ఈ రోజుల్లో ఒక సినిమా ఫ్లాప్ అయిందంటే అందుకు భాద్యత హీరోలు ఏ మాత్రం తీసుకోరు. మొత్తం నేరాన్ని దర్శకుడుపైనే నెట్టేస్తారు. ఆ దర్శకుడు తమ మాట వినలేదు కథ మార్చమంటే మార్చలేదు అని రాకరాకాల కారణాలు చెప్తారు. ఇటువంటి సందర్భాలు టాలీవుడ్ లో చాలానే చూసాం. ఆ మధ్య వచ్చిన ఓ సీనియర్ టాప్ స్టార్ సినిమా భారీ అంచనాల మధ్య రిలీజై డిజాస్టర్ అవడంతో నేరాన్ని పూర్తిగా దర్శకుడిపైనే వేశారు.ఆమిర్ ఖాన్ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేసిన థగ్స్ ఆఫ్ హిందుస్తాన్, లాల్ సింగ్ చద్దాలు బాక్సాఫీస్ వద్ద దారుణంగా బెడిసి కొట్టిన సంగతి తెలిసిందే. తారే జమిన్ పర్ సీక్వెల్ అంటూ ఆమిర్ ఖాన్ మరోసారి అందరినీ ఆకట్టుకునేందుకు రెడీ అవుతున్నాడు. ఆమిర్ ఖాన్ నటించిన థగ్స్ ఆఫ్ హిందుస్తాన్ గురించి స్పందించాడు. ఆ సినిమా తనకు కూడా నచ్చలేదని, ఆ విషయం మేకింగ్ టైంలోనే అర్థమైందట. కానీ దర్శకుడికి బాగానే అనిపించిందట.కానీ బాలీవుడ్ టాప్ ఖాన్స్ లో ఒకరు అమీర్ ఖాన్. 3 ఇడియట్స్, పీకే, ధూమ్, దంగల్ వంటి ఇండియా బిగ్గెస్ట్ హిట్ సినిమాలు ఈ హీరో కెరీర్ లో ఉన్నాయి. ఇక అమీర్ ఖాన్ చివరిగా నటించిన చిత్రం ‘లాల్ సింగ్ చద్దా’. అద్వైత్ చందన్ దర్శకత్వంలో పాన్ ఇండియా భాషల్లో ఈ చిత్రం తెరకెక్కింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా డిజాస్టర్ టాక్ తెచుకుంది. 180 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కిన లాల్ సింగ్ చద్దా రూ. 100 కోట్లకు పైగానే నష్టాలు మిగిల్చింది. అయితే ఈ చిత్ర ఫెయిల్యూర్ గురించి అమీర్ రెహచక్రవర్తి ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ ” లాల్ సింగ్ చద్దాలో నా పెర్ఫార్మెన్స్ బాగోలేదు, అందుకే ఆ సినిమా ఫ్లాప్ అయింది. నాకు పర్సనల్ గా లాల్ సింగ్ చాలా ఇష్టం, కానీ ఈ సినిమాలో నా నటన ఓవర్ అయినట్టు అనిపించింది, అందుకే ప్రజలు దానితో కనెక్ట్ కాలేదు. ఈ ఫెయిల్యూర్ కు పూర్తి భాద్యత నాదే, సితార జమీర్ పర్ అందరికి నాచే విధంగా ఉంటుంది” అని అన్నారు. ఫెయిల్యూర్ సినిమాను కూడా తన భాద్యతగా ఒప్పుకున్న అమీర్ ను నెటిజన్స్ మెచ్చుకుంటున్నారు.