ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపును సంపాదించుకున్న దర్శకులలో
ఎస్ ఎస్ రాజమౌళి ఒకరు.
రాజమౌళి ఆఖరుగా మెగా
పవర్ స్టార్ రామ్ చరణ్ , యంగ్ టైగర్
జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా ఆర్ ఆర్ ఆర్ అనే సినిమాను రూపొందించాడు. ఈ
మూవీ భారీ అంచనాల నడుమ ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయ్యి అద్భుతమైన విజయాన్ని
బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుంది. ఇక ఈ
మూవీ కి ఎన్నో జాతీయ ,
అంతర్జాతీయ పురస్కారాలు కూడా లభించాయి. ఏకంగా ఈ సినిమాకు
ఆస్కార్ అవార్డు కూడా దక్కింది. దానితో ఈ సినిమాను తెరకెక్కించిన
రాజమౌళి కి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు లభించింది.
ఆర్ ఆర్ ఆర్ లాంటి అద్భుతమైన విజయవంతమైన
సినిమా తర్వాత
రాజమౌళి , మహేష్ బాబు హీరో గా ఓ సినిమాను రూపొందించబోతున్నాడు. ఇప్పటికే అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. చాలా రోజుల నుండి ఈ
సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులపై ఫోకస్ పెట్టిన
రాజమౌళి ఇప్పటికే ఈ
మూవీ కి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులను ఆల్మోస్ట్ పూర్తి చేసినట్లు తెలుస్తోంది. కాకపోతే ఈ సినిమాను స్టార్ట్ చేయడానికి
రాజమౌళి ఇంకా కాస్త సమయం తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. దానికి ప్రధాన కారణం ఈ సినిమాను
హాలీవుడ్ రేంజ్ కి తీసుకు వెళ్లడానికి ఆయన ఈ
మూవీ ప్రారంభం అయ్యే టైమ్ కే కొన్ని
హాలీవుడ్ సంస్థలతో ఒప్పందం చేసుకోబోతున్నట్లు , అలా ఏదైనా ఒక మంచి
హాలీవుడ్ సంస్థతో ఒప్పందం చేసుకొని ఈ
మూవీ ని స్టార్ట్ చేసే ఆలోచనలో
రాజమౌళి ఉన్నట్లు తెలుస్తోంది.
ఇలా
రాజమౌళి ఈ
సినిమా విషయంలో మొదటి నుండి
హాలీవుడ్ మార్కెట్ ను దృష్టి లో పెట్టుకుని ఈ సినిమాను రూపొందించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ
సినిమా అద్భుతమైన విజయం సాధిస్తే మహేష్ బాబు కి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు లభించే అవకాశం చాలా వరకు ఉంది.