టాలీవుడ్ లో
లవ్ బర్డ్స్ అనగానే ప్రస్తుతం అందరికీ గుర్తుకు వచ్చేది
విజయ్ దేవరకొండ రష్మిక మందన్నాలు మాత్రమే. వీరిద్దరి పరిచయం గీత గోవిందం
సినిమా సమయంలో ఏర్పడింది. అప్పటినుండి వీరు తమ రిలేషన్ ని మెయింటైన్ చేస్తూనే ఉన్నారు.అయితే తాజాగా
రష్మిక మందన్నా గురించి ఒక న్యూస్ వైరల్ అవుతుంది. అదేంటంటే..రష్మిక మందన్నా ఓ
హీరో మీద ప్రేమతో ముంబైకి తన మకాం మార్చుతుందట. దాంతో మరి
విజయ్ దేవరకొండ పరిస్థితి అంటూ చాలామంది నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.మరి ఇంతకీ
రష్మిక మందన్నా ప్లానేంటి..ఆమె వేరే
హీరో కోసం
ముంబై కి వెళ్లడం ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం..
రష్మిక మందన్నా
ముంబై కి వెళ్ళేది
బాలీవుడ్ స్టార్ నటుడు
సల్మాన్ ఖాన్ కోసం..
అయితే ప్రస్తుతం
సల్మాన్ ఖాన్ హీరోగా చేస్తున్న సిఖందర్ మూవీలో
రష్మిక మందన్నా నటించిన సంగతి మనకు తెలిసిందే. అయితే ఈ
సినిమా 2025 లో రిలీజ్ అవుతుంది అని చెప్పారు.కాబట్టి ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా పూర్తి చేయాలి అని చిత్ర యూనిట్ భావిస్తుందట. ఇక భారీ పాన్
ఇండియా మూవీ కాబట్టి ఈ సినిమాకి ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.అయితే తక్కువ సమయంలో ఈ సినిమాను తెరకెక్కించాలి అంటే అందరూ నటీనటులు ఒకే దగ్గర ఉండాలి. అలా ఈ
సినిమా షూటింగ్ ప్రస్తుతం 45 రోజుల పాటు కంటిన్యూస్ గా తెరకెక్కించాలని
డైరెక్టర్ అనుకున్నారట.
ఇక దీనికోసం
రష్మిక మందన్నా కూడా
హైదరాబాద్ వదిలేసి ముంబైలో నెలరోజుల పాటు ఉండడానికి రెడీ అయిపోయింది.ఇక ఈ విషయం ప్రస్తుతం నెట్టింట వైరల్ అవ్వడంతో
సల్మాన్ ఖాన్ కోసం
రష్మిక మందన్నా
ముంబై కి వెళ్తే మరి హైదరాబాదులో ఉన్న
విజయ్ దేవరకొండ పరిస్థితి ఏంటి అని
రష్మిక విజయ్ దేవరకొండల అభిమానులు ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు.