కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ – జాన్వీ కపూర్ జంటగా తెరకెక్కుతున్న దేవర సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రెండు పార్టులుగా తెరకెక్కుతున్న దేవర నుంచి మొదటి పార్ట్ సెప్టెంబర్ 27న రిలీజ్ కానుంది. ఇప్పటికే రిలీజ్ చేసిన గ్లింప్స్, రెండు సాంగ్స్ తో సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. త్వరలో మూడో సాంగ్ కూడా రిలీజ్ కానుందని వార్తలు వస్తున్నాయి.ఆల్రెడీ దేవర ఆల్బమ్ మీద అందరికీ ఓ రేంజ్ అంచనాలు ఏర్పడ్డాయి. ఫియర్, చుట్టమల్లే పాటలతో దేవర ఆల్బమ్ అదిరిపోతుందని అంతా ఫిక్స్ అయ్యారు. ఇక మూడో పాటకు సంబంధించిన షూటింగ్ ఈ మధ్యే జరిగింది. అది ఎన్టీఆర్ ఇంట్రో సాంగ్ అని లీక్ వచ్చింది. ఆయుధ పూజకు సంబంధించిన ఈ పాట షూటింగ్ గురించి లిరిసిస్ట్ రామజోగయ్య శాస్త్రి అప్పుడే లీక్ ఇచ్చాడు. ఎన్టీఆర్ దేవర మూవీ మీదున్న అంచనాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కొరటాల శివ చాలా టైం తీసుకుని దేవరను చెక్కుతున్నాడు. ఎన్టీఆర్ సైతం ఈ మూవీ మీద చాలా ఫోకస్డ్గా ఉన్నాడు. అనిరుధ్ ఈ మూవీని ఇప్పుడు భుజానికి ఎత్తుకున్నాడు. మ్యూజికల్ ప్రమోషన్స్ ఆల్రెడీ పీక్స్‌కు చేరుకున్నాయి. ఫియర్ సాంగ్, చుట్టమల్లే పాటలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ఇక ఇప్పుడు మూడో పాటకు సంబంధించిన అప్డేట్ వచ్చేసింది. రామజోగయ్య శాస్త్రి ఈ మూడో పాట గురించి హింట్ ఇస్తూ హైప్ ఎక్కించాడు.
దేవర సాంగ్స్ లిరిసిస్ట్ రామజోగయ్య శాస్త్రి తాజాగా తన సోషల్ మీడియా లో దేవర మూడో సాంగ్ పై పోస్ట్ చేసారు. రామజోగయ్య శాస్త్రి తన పోస్ట్ లో.. మూడో పాట.. పాటకు మించిన ఆట.. కన్నుల పండగ. ఒక ఆట ఆడుకున్నాడట తారకరాముడు. ఎప్పుడని అడక్కండి. ఎప్పుడొచ్చినా భీభత్సమే పక్కా. ఈ ఆల్బమ్ వేరే లెవెల్ అంతే అని రాసుకొచ్చారు.దీంతో ఆ మాటలే గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయని అభిమానులు కామెంట్ చేస్తున్నారు.దీంతో ఈ మూడో పాటలో ఎన్టీఆర్ అదిరిపోయే స్టెప్స్ వేయనున్నట్టు, ఈ సాంగ్ ఓ రేంజ్ లో ఉండబోతున్నట్టు తెలుస్తుంది. సెప్టెంబర్ మొదటివారంలో ఈ సాంగ్ ని విడుదల చేయనున్నట్టు తెలుస్తుంది. దీంతో ఈసారి దేవర పాట తో పాటు ఎన్టీఆర్ స్టెప్స్ కోసం ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. ఇటీవలే దేవర నుంచి ఓ పోస్టర్ రిలీజ్ చేసి ఇందులో ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ అని హింట్ ఇచ్చారు మూవీ యూనిట్.దేవర నుంచి ఇప్పుడు మూడో పాటను త్వరగా రిలీజ్ చేసి.. వినాయక చవితి స్పెషల్‌గా ట్రైలర్‌ను కూడా రిలీజ్ చేయాలని యూనిట్ అనుకుంటోందట. సెప్టెంబర్ 27న రిలీజ్ ఉండటంతో ఇక త్వరగా ప్రమోషన్స్ జోరు పెంచాలని యూనిట్ అనుకుంటోందట.