ఆ సినిమాతో సరికొత్త ట్రెండ్ సృష్టించిన చిరంజీవి.. ఇప్పుడు ఎవరు ఆ సాహసం చేయలేరుగా..?

murali krishna
మెగాస్టార్ చిరంజీవి.. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరుకు ఉన్న క్రేజే వేరు. ఎందుకుంటే స్వయంకృషితో ఎదిగిన నటుడాయన. ఆయన నుంచి సినిమా వస్తుందంటే చాలు మెగా అభిమానులు పూనకాలతో ఊగిపోతారు. ఆరు పదుల వయసులోనూ కుర్ర హీరోలకు దీటుగా ఇంకా సినిమాలు చేస్తున్నారు.తన స్వయంకృషి ఎదుగుదలతో ఎందరిలోనో స్ఫూర్తిని నింపిన హీరో మెగాస్టార్ చిరంజీవి. తన యాక్షన్‌, డ్యాన్స్‌లతో ఇండస్ట్రీలో ఓ సరికొత్త ట్రెండ్ సృష్టించారు. కామెడీ, ఎమోషన్‌.. ఇలా నవరసాలన్నింటిని పలికించడంలో ఆయనో మాస్టర్. ప్రతి ఛాలెంజ్‌ను స్వీకరించి విజేతగా నిలిచారాయన. తన చిత్రాలతో బాక్సాఫీసు వసూళ్ల వేటలో మగ మహారాజుగా నిలిచారు.మెగాస్టార్ చిరంజీవి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీస్ లో “చూడాలని ఉంది” సినిమా కూడా ఒకటి. చిరుని సరికొత్తగా సిల్వర్ స్క్రీన్ పై ఆవిష్కరించిన ఆ చిత్రం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో సరికొత్త ట్రెండ్స్ కి శ్రీకారం చుట్టింది.చూడాలని ఉంది 1998లో గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన సినిమా. చిరంజీవి, సౌందర్య, ప్రకాష్ రాజ్, అంజలా జవేరి ఇందులో ప్రధాన పాత్రధారులు.[1]ఈ చిత్రాన్ని సి. అశ్వనీదత్ వైజయంతి మూవీస్ పతాకంపై నిర్మించాడు. దివాకర్ బాబు మాటలు రాశాడు. ఈ సినిమాకు మణిశర్మ సంగీత దర్శకత్వం వహించగా, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, సుజాత, హరిహరన్, ఉదిత్ నారాయణ్, స్వర్ణలత, శంకర్ మహదేవన్, చిత్ర పాటలు పాడారు. వేటూరి సుందరరామ్మూర్తి పాటలు రాశాడు. ఈ చిత్ర సంగీతానికి గాను మణిశర్మకు నంది పురస్కారం, ఫిల్మ్ ఫేర్ పురస్కారాన్ని కూడా అందుకున్నాడు.
 చిరు మాస్ సినిమాల ట్రెండ్ నడుస్తున్న టైం లో సడన్ గా ఒక లవ్ స్టోరీ తో వస్తాడని అప్పటికీ ఎవ్వరూ ఊహించలేదు. క్లాస్ & మాస్ టచ్ తో వచ్చిన ఈ సినిమా భారీ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. అప్పటివరకు గుణశేఖర్  అంటే పిల్లల సినిమా తీసే సాధారణ డైరెక్టర్ అనుకున్నారు కానీ, ఈ రేంజ్ మాస్ సినిమా దించుతాడని అనుకోలేదు అనుకోలేదు. గుణశేఖర్ అంటే భారీ సెట్లకు పెట్టింది పేరని అంటుంటారు ఇండస్ట్రీ జనాలు. ఆ ట్రెండ్ స్టార్ట్ అయింది ఇక్కడి నుండే.


ఇక ‘చూడాలని ఉంది’ సినిమా మొదలు పెట్టినపుడు చిన్న డైరెక్టర్ తో చిరంజీవి ఇంత రిస్క్ ఎందుకు చేస్తున్నాడని అందరూ కామెంట్స్ చేసారు. పైగా అప్పటికే హిట్లర్, మాస్టర్, బావగారు బాగున్నారా సినిమాలతో హ్యాట్రిక్ సొంతం చేసుకున్నాడు. అంతకు మించి రామ్ గోపాల్ వర్మ, సింగీతం శ్రీనివాసరావు లాంటి స్టార్ డైరెక్టర్ లతో మొదలు పెట్టిన సినిమాలు ఆగిపోయాయి. పైగా సినిమా మొదలెట్టాక బడ్జెట్ కూడా కమర్షియల్ సినిమాలని మించి గుణశేఖర్ చెప్పే సరికి నిర్మాత అశ్వినిదత్ కూడా షాక్ అయ్యాడట. ఏది ఏమైనా కథని నమ్మి చిత్ర యూనిట్ సినిమా మొదలుపెట్టారు. అయితే సినిమాలో హైలెట్ గా నిలిచే సీన్స్ లో కలకత్తా అపార్ట్మెంట్ సెట్ ఒకటి. ఈ సెట్ కోసం ఆ రోజుల్లోనే కోటి రూపాయల బడ్జెట్ అయింది. ఈ విషయం ఇండస్ట్రీ లో హాట్ టాపిక్ అయింది.ఇక అప్పట్లో చూడాలని ఉంది సినిమా హైలెట్స్ లో ఒకటి రైల్వేస్టేషన్ లో లవ్ ట్రాక్ సీన్. హీరో, హీరోయిన్లకి ఒక్క డైలాగ్ లేకుండా చూపులతోనే నడిచే లవ్ సీన్ ఏకంగా పది నిమిషాల పాటు ఉంటుంది. ఇది అసలు వర్కౌట్ కాదని అశ్వినీదత్ అన్నారట. కానీ సినిమా హైలెట్స్ లో ఇది కూడా ఒకటిగా నిలిచింది. సౌందర్య, అంజలా జవేరి హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాలో ప్రకాష్ రాజ్ విలన్ గా నటించాడు. ఆ రోజుల్లో సంచలన విజయం సాధించిన ఈ సినిమా ఏకంగా 63 కేంద్రాల్లో వంద రోజులు జరుపుకోగా 15 కోట్ల షేర్ వసూలు చేసి, కొద్దిలో ఇండస్ట్రీ రికార్డ్ మిస్ అయింది.ఇక ప్రస్తుతం చిరు సోషియో ఫాంటసీ విశ్వంభర చిత్రాన్ని సెలెక్ట్ చేశారు. ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో సందడి చేయనుంది. 2025 జనవరి 10న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. అయితే ఈ సినిమా కోసం ప్రస్తుతం చిరు రూ.40కోట్ల వరకు అందుకుంటున్నారని తెలిసింది. ప్రస్తుతం ఉన్న సీనియర్ హీరోల్లో బాలయ్య, నాగార్జున, వెంకటేశ్ కన్నా ఎక్కువగా తీసుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: