అల్లు
అర్జున్ ప్రస్తుతం పుష్ప పార్ట్ 2
మూవీ లో
హీరో గా నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. పుష్ప పార్ట్ 1
మూవీ భారీ
బ్లాక్ బస్టర్ విజయం సాధించడంతో పుష్ప రెండవ భాగంపై ప్రేక్షకుల్లో
ఇండియా వ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి. పుష్ప రెండవ భాగాన్ని కొంత కాలం క్రితం ఆగస్టు 15 వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అందుకు అనుగుణంగా ప్రచారాలను కూడా మొదలు పెట్టారు. దానితో ఈ
సినిమా ఆగస్టు 15 వ తేదీన కచ్చితంగా విడుదల అవుతుంది అని చాలా మంది అనుకున్నారు. కానీ సడన్ గా ఈ
మూవీ బృందం ఈ సినిమాను ఆగస్టు 15 వ తేదీన కాకుండా
డిసెంబర్ 6 వ తేదీన విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది.
ఇక ఈ
సినిమా విడుదల తేదీని అనౌన్స్ చేసిన తర్వాత కూడా ఈ
సినిమా షూటింగ్ స్పీడ్ గా జరగడం లేదు. ఈ
మూవీ విడుదల మళ్ళీ వాయిదా పడే అవకాశం ఉంది అని వార్తలు వచ్చాయి. దానితో ఈ
మూవీ కి సంబంధించిన వ్యక్తులు
డిసెంబర్ 6 వ తేదీన పుష్ప పార్ట్ 2
మూవీ కచ్చితంగా విడుదల అవుతుంది అని చెబుతూ వస్తున్నారు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం పుష్ప రెండవ భాగం కు సంబంధించిన మొత్తం షూటింగ్ ను
అక్టోబర్ చివరి వారం వరకు పూర్తి చేసి విధంగా మేకర్స్ ప్లాన్ చేసినట్లు ఆ తర్వాత దాదాపు రెండు నెలల పాటు ఈ
మూవీ బృందం ఈ సినిమాకు సంబంధించిన దేశ వ్యాప్త ప్రచారాలను చేయనున్నట్లు తెలుస్తోంది.
ఈ సినిమాను పూర్తి చేయడం మాత్రమే కాకుండా ప్రచారాలతో ఈ సినిమాపై ఉన్న అంచనాలను మరింత పెంచేందుకు గాను పక్కా ప్లానింగ్ ను పుష్ప 2
మూవీ యూనిట్ ఇప్పటికే వేసుకున్నట్లు తెలుస్తోంది. మరి "పుష్ప 1" తో
అల్లు అర్జున్ కి మంచి విజయం దక్కింది. మరి "పుష్ప 2"
అల్లు అర్జున్ ఏ స్థాయి విజయాన్ని దక్కించుకుంటాడో చూడాలి.