ఉప్పెన మూవీతో తెలుగుచిత్ర సీమ పరిశ్రమ లోకి ఎంట్రీ ఇచ్చింది కన్నడ భామ కృతి శెట్టి.. మొదటి సినిమాతో ఈ హీరోయిన్ పేరు ఎంతలా మార్మోగిపోయిందంటే ఎంతో మంది కుర్ర కారు ఈ హీరోయిన్ ఫోటోలను వాట్సప్ డీపీలుగా,లాప్ ట్యాప్స్,ఫోన్లలో వాల్ పేపర్స్ గా పెట్టుకున్నారు. ఇక ఈమె మీద ఎడిటింగ్ అయితే మామూలుగా జరగలేదు. చాలామంది సీనియర్ హీరోయిన్లను పక్కకు నెట్టి ఈ హీరోయిన్ తమ గుండెల్లో గూడు కట్టుకుంది అంటూ ఎంతో మంది యూత్ ఈమె అందానికి ఫిదా అయ్యారు.అయితే అలాంటి కృతి శెట్టి ఉప్పెన మూవీ తర్వాత వచ్చిన రెండు సినిమాలు బ్లాక్ బస్టర్ అయ్యాయి. దాంతో కృతి శెట్టికి ఇండస్ట్రీలో తిరుగులేదు అనుకున్నారు.కానీ సినీ కెరియర్లో హిట్స్,ప్లాప్స్ అనేది సర్వ సామాన్యం అనే విధంగా ఈమెకు వచ్చిన మూడు హిట్స్ తర్వాత వరుస సినిమాలు ఫ్లాప్స్ అయ్యాయి.కానీ హిట్స్ వచ్చాయని పొంగిపోలేదు.. ఫ్లాప్స్ వచ్చాయని నిరాశ పడలేదు ఈ ముద్దుగుమ్మ.అలా కృతి శెట్టి ఇండస్ట్రీలో తన స్టార్డం కొనసాగిస్తూనే ఉంది.
అయితే గత కొద్ది కాలంగా సైలెంట్ అయిన ఈ ముద్దుగుమ్మ తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఉప్పెన సినిమా హిట్ అయ్యాక కొంతమంది నాకు మద్దతుగా నిలిచారు.కానీ మరి కొంతమంది మాత్రం ఈ సినిమా ఫ్లాప్ అయితే బాగుండు ఈమెను వేలెత్తి చూపించవచ్చు అని అనుకున్నారు. కానీ నేను వారికి ఛాన్స్ ఇవ్వలేదు. ఎందుకంటే నా సినిమా హిట్ అయితే నేను ఒక్కదాన్నే క్రెడిట్ తీసుకోలేదు.అందుకే ప్లాప్ అయినా కూడా ఆ క్రెడిట్ నేను తీసుకోలేదు. అందుకే నేను వరుస సినిమాలు చేసుకుంటూ పోతున్నాను..ఇక నా సినిమాలు హిట్ అయినా దానికంటే ఫ్లాప్ అయితేనే నేను ఇండస్ట్రీలో ఇంకా ఎక్కువ నేర్చుకున్నాను.
ఫ్లాప్ అయిన సినిమాల్లో నేను ఎక్కడ తప్పులు చేశానో వాటిని సరిదిద్దుకొని నా నెక్స్ట్ సినిమాల్లో అలాంటి తప్పులు చేయకుండా ఉంటున్నాను.ఇక సినిమాల్లో సక్సెస్ కంటే ఫెయిల్యూర్స్ వల్లే మంచి గుణపాఠం వస్తుంది. అలా నేను నటించిన సినిమాలు ఫ్లాప్ అవ్వడం వల్ల వాటి నుంచి ఎన్నో నేర్చుకున్నాను. అందుకే ఎవరెన్ని విమర్శలు చేసినా కూడా నేను వాటిని తట్టుకొని ఇండస్ట్రీలో స్ట్రాంగ్ గా నిలబడగలుగుతున్నాను.. అంటూ కృతి శెట్టి మాట్లాడింది.ప్రస్తుతం కృతి శెట్టి మాటలు విన్న ఆమె అభిమానులు కృతి శెట్టి సినిమాలు ఫ్లాప్ అవ్వాలని ఆమెపై కుట్రలు చేస్తుంది ఎవరబ్బా అంటూ కామెంట్లు పెడుతున్నారు.