బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రా ఖరీదైన నగలు, వస్త్రాలు ధరిస్తుంది అనే టాక్ మీడియా లో ఇప్పటికే ఉంది.ఈమె తన మెడలో వేసుకునే నక్లెస్ ల విలువ కోట్లలోనే ఉంటుంది. అలా ఫ్యాషన్ కి బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న ఈ ముద్దుగుమ్మ తాజాగా తన సోదరుడి పెళ్లిలో కోట్ల ఖరీదు చేసే ముత్యాల దండని మెడలో వేసుకుంది. ఇక ఈ ముత్యాల దండ ఖరీదు తెలిస్తే అందరూ నోరేళ్లబెట్టాల్సిందే. మరి ఇంతకీ ప్రియాంక చోప్రా తన మెడలో వేసుకున్న ఆ ముత్యాల దండ ఖరీదు ఎంతో ఇప్పుడు చూద్దాం.. ప్రియాంక చోప్రా ఏ ఈవెంట్ కి వెళ్ళినా కూడా చాలా ఖరీదైన నగలు, ఖరీదైన దుస్తులు వేసుకొని రావడం ఈమెకు ఇష్టం కావచ్చు.అందుకే ఎక్కడికి వెళ్ళినా సరే చాలా లగ్జరీ లైఫ్ ని మెయింటైన్ చేస్తుంది.ఇక ఆ మధ్యకాలంలో బల్గారి 140వ వార్షికోత్సవ ఈవెంట్ లో తన మెడలో ఉన్న నక్లెస్ తో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచింది.
ఎందుకంటే ఆ ఈవెంట్ కి దాదాపు 320 కోట్ల విలువ చేసే నెక్లెస్ ప్రియాంక చోప్రా తన మెడలో వేసుకొని అందరితో వామ్మో అంతా ఖరీదా అని అనిపించేలా చేసింది. ఇక ఆ 320 కోట్ల నెక్లెస్ తయారు చేయడానికి దాదాపు 2800 సమయం పట్టిందని కూడా చెప్పింది. అయితే తాజాగా తన సోదరుడు సిద్ధార్థ్ చొప్రా వివాహానికి సంబంధించిన ఫోటోలను షేర్ చేసుకుంది ప్రియాంక. ఇక ఈ ఫోటోలలో ప్రియాంక చోప్రా సోదరుడి పెళ్లి రోజు పింక్ కలర్ లో ఉండే శారీ కట్టుకుంది. ఇక ఈ సారీ కి మ్యాచింగ్ గా వేసుకున్న ముత్యాల దండ ధర ప్రస్తుతం నెట్టింట్లో టాక్ ఆఫ్ ది మీడియాగా మారిపోయింది.
ఇక ఆ ముత్యాల దండ ఖరీదు ఎంత అంటే దాదాపు 8 కోట్ల రూపాయలట. అవును మీరు వినేది నిజమే.. 8 కోట్ల విలువ చేసే ముత్యాల దండను ప్రియాంక చోప్రా తన మెడలో వేసుకుంది.ఇక ఈ ముత్యాల దండలో కేవలం ఓహ్ సో క్లాసీ యాక్సెసరీ ముత్యాలు మాత్రమే కాదు రూబీలు, వజ్రాలు కూడా పొదిగి ఉన్నాయి. అయితే కొన్ని నివేదికల ప్రకారం ఈ నెక్లెస్ ధర దాదాపు 8 కోట్లు ఉంటుందని తెలుస్తోంది