నందమూరి తారక రామారావు.. ఇది ఒక పేరు కాదు.. బ్రాండ్. చరిత్రలో నిలిచిన పేరు. తెలుగువాడు ఎక్కడైనా సగర్వంగా చెప్పుకొనే పేరు. చలన చిత్ర రంగంలో ఎవ్వరు .. ఎప్పటికి మర్చిపోలేని పేరు. అవార్డులకు.. రివార్డులకు పెట్టింది పేరు.. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో.. ఇంకెన్నో. ఎన్టీఆర్ మనమధ్య లేకపోయినా.. ఆయన సాధించిన ఘనత, కీర్తి.. తెలుగువాడు ఉన్నంతవరకు ఉంటుంది. ఇక ఎన్టీఆర్ లెగసీని నందమూరి కుటుంబం ముందుకు తీసుకెళ్తోంది. ఇక ఈ ఏడాది ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలను నందమూరి కుటుంబం ఘనంగా జరిపిన విషయం తెల్సిందే.టాలీవుడ్ ఇండస్ట్రియల్ నందమూరి ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. టాలీవుడ్ లో పౌరాణిక పాత్రలో నటించి నందమూరి హీరోస్ అంత తమ సత్తా చాటుకున్నారు.ఈ ఫ్యామిలీ హీరోలు తెలుగులోనే కాదు.. ప్రపంచ సినీ చరిత్రలోనే తమకంటూ ఓ రికార్డును క్రియేట్ చేశారు. ఇప్పటివరకు రాముడఏ కాదు.. కృష్ణుడు అవవతారంలోను అరుదైన రికార్డును క్రియేట్ చేసుకున్నారు. వేరే ఏ హీరోలు కూడా ఇప్పటివరకు ఆ రికార్డులు టచ్ చేయలేదు. ఇంతకీ అసలు మ్యాటర్ ఏంటో ఒకసారి చూద్దాం. ఎన్టీఆర్ హీరోగా వినాయక్ డైరెక్షన్లో వచ్చిన.. ఆది సినిమాలో ఓ పాట ఉంటుంది.అందులో నాటి రాముడి రూపం మాకు మాత్రమే సొంతం అనే సాంగ్ ఇప్పటికీ ప్రేక్షకులకు గుర్తుండే ఉంటుంది. ఇలా రాముడు పాత్ర విషయంలో రికార్డ్ సెట్ చేసిన నందమూరి హీరోలు.. కృష్ణుడి పాత్ర విషయంలోనూ ఎవరికి సాధ్యం కానీ రికార్డును సృష్టించారు. ఇప్పటివరకు నందమూరి కుటుంబం నుంచి వచ్చిన ఎన్టీఆర్ తో పాటు ఆయన కొడుకులు హరికృష్ణ, బాలకృష్ణ, మనవడు జూనియర్ ఎన్టీఆర్, నాలుగో తరానికి చెందిన మాస్టర్ ఎన్టీఆర్ సహా శ్రీకృష్ణుని పాత్రలో నటించి ప్రేక్షకులను మెప్పించారు. తెలుగు ప్రేక్షకులకు శ్రీకృష్ణుడు అంటే టక్కున గుర్తుకు వచ్చేది సీనియర్ ఎన్టీఆర్ పేరే.
ఏకంగా 18 సినిమాల్లో శ్రీకృష్ణ భగవానుడి రూపంలో వెండితెరపై నటించి మెప్పించారు అన్నగారు. ఒక పాత్రను ఎన్ని సినిమాల్లో చేయడం అనేది నిజంగానే వరల్డ్ రికార్డ్. ఎన్టీఆర్ ఫస్ట్ టైం శ్రీకృష్ణుడుగా కనిపించిన సినిమా మాయాబజార్. 1953లో రిలీజ్ అయిన ఇద్దరు పెళ్ళాలు సినిమాలో అన్నగారు 30 ఏళ్ళ వయసులో డ్రీం సాంగ్లో తెలుగుతరపై కృష్ణుడి పాత్రలో మెప్పించాడు. మొదటిసారి కృష్ణుడు పాతులో కనిపించిన ఈయన.. ఈ సినిమా తర్వాత ఏకంగా 30కి పైగా సినిమాల్లో శ్రీకృష్ణుడు పాత్రలో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. అది కేవలం అన్నగారికి మాత్రమే సొంతమైన రికార్డ్.ఇక ఎన్టీఆర్ పెద్ద కొడుకు హరికృష్ణ హీరోగా ఎంట్రీ ఇచ్చిన శ్రీకృష్ణవతారం సినిమాల్లో ఎన్టీఆర్ టైటిల్ రోల్ పోషించగా.. చిన్ననాటి బాలకృష్ణుడి వేషంలో హరికృష్ణ కనిపించి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఎన్టీఆర్ మరో నట వారసుడిగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన బాలకృష్ణ ప్రస్తుతం ఎన్టీఆర్ లేగసినీ కంటిన్యూ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక బాలయ్య కూడా ఇప్పటివరకు ఎన్నో సినిమాల్లో కృష్ణుడు పాత్రలో నటించాడు. శ్రీకృష్ణార్జున విజయం, పాండురంగడు సినిమాల్లో శ్రీకృష్ణుడి పాత్రలో ఆకట్టుకున్నాడు. మంగమ్మగారి మనవడు, పట్టాభిషేకం సినిమాల్లో కృష్ణుడిగా చిటుకున్న మెరిసి మాయమవుతాడు.ఎన్టీఆర్ మనవడు జూనియర్ ఎన్టీఆర్ మోడల్ శ్రీకృష్ణ అవతారంలో బృందావనంతో ఆకట్టుకున్నాడు. రాజమౌళి కలల ప్రాజెక్ట్ మహాభారతంలోనూ శ్రీకృష్ణుడు పాత్ర కోసం ఎన్టీఆర్ను సెలెక్ట్ చేసుకున్నట్లు తెలుస్తుంది. అంటే ఏన్టీఆర్ త్వరలోనే పౌరాణిక శ్రీకృష్ణుడి పాత్రలో ప్రేక్షకులు చూడనున్నారు.
ఇక నందమూరి నాలుగో తరం ఎన్టీఆర్.. హరికృష్ణ పెద్ద కుమారుడు జానకిరామ్ తనయుడు.. మాస్టర్ ఎన్టీఆర్ అతి చిన్న పిల్లలతో తెరకెక్కిన దాన వీర శూరకర్ణ లో శ్రీకృష్ణుడి పాత్రలో కనిపించి ఆకట్టుకున్నాడు. ఇలా ఇప్పటివరకు ఒకే ఇంట్లో ఎంతమంది హీరోలు ఓ పౌరాణిక పాత్రను పోషించడం అనేది కేవలం నందమూరి ఫ్యామిలీకి మాత్రమే సొంతమైన రికార్డ్ ఇప్పటివరకు ఆ రికార్డు ఎవరు టచ్ చేయలేకపోయారు.