ఏంటి ఆలీ ఆ అమ్మాయితో అసభ్యంగా మాట్లాడి గుండాలతో తన్నులు తిన్నాడా.. ఇంతకీ ఆ వ్యక్తి చెప్పిన దాంట్లో ఎంత నిజం ఉంది. నిజంగానే ఆలీ ఇంటికి గూండాలు వచ్చి రచ్చ రచ్చ చేసి ఆలీ మీదకి దాడికి దిగారా.. ఇంతకీ ఆలీ చేసిన తప్పేంటి అనేది ఇప్పుడు చూద్దాం.. ఆలీ ఇంటికి పైల్వాన్లు వచ్చి ఆయనపై దాడి చేయాలని చూశారు అనే వార్త రూమర్ కాదు. ఇది నిజమే.. ఎందుకంటే స్వయంగా ఈ విషయాన్ని జూబ్లీహిల్స్ లోని చిన్న శ్రీశైలం యాదవ్ ఈ విషయాన్ని బయటపెట్టారు.. ఇక అసలు విషయంలోకి వెళ్తే..ఆలీ మేకప్ మాన్ కారణంగా ఆయన చిక్కుల్లో పడ్డారట.ఆలీ మేకప్ మాన్ ఓ అమ్మాయికి ఫోన్ చేసి అసభ్యంగా మాట్లాడంతో ఆ అమ్మాయి పాత బస్తీలోని కొంతమంది పైల్వాన్లకి ఈ విషయం చెప్పిందట.
దాంతో ఆ పైల్వాన్లు ఆమె అసిస్టెంట్ ఎక్కడ ఉంటాడా అని ఆరా తీస్తూ చివరికి ఆమె ఇంటికి వచ్చారట.ఆయన ఇంటికి వచ్చి ఇంట్లో ఉన్న వస్తువులన్నీ చిందరవందరగా పడేసి ఆలీ మీదికి కూడా దాడికి దిగారట. ఆ సమయంలో ఆలీకి పోలీసుల కంటే ముందుగా ఆయన ఇంటికి వచ్చిన పైల్వాన్లకి ఆపోజిట్ వర్గం అయిన జూబ్లీహిల్స్ చిన్న శ్రీశైలం యాదవ్ అనే ఆయన గుర్తుకు వచ్చాడట. దాంతో వెంటనే ఆయనకు ఫోన్ చేసి జరిగిందంతా చెప్పడంతో అటు ఆ అమ్మాయి తరఫున వాళ్లు ఇటు ఆలీ తరుపున వాళ్లు మాట్లాడుకొని ఈ మ్యాటర్ ని సెటిల్ చేశారట.
ఆ తర్వాత ఆలీకి వారి నుండి ఎలాంటి ఇబ్బందులు కూడా తలెత్తవని మాట ఇచ్చారట. అయితే ఈ విషయాన్ని తాజాగా ఓ ఇంటర్వ్యూలో జూబ్లీహిల్స్ చిన్న శ్రీశైలం యాదవ్ బయటపెట్టారు.ఇలా కమెడియన్ ఆలీ హెయిర్ డ్రెస్సర్ చేసిన తప్పు పని కారణంగా ఆలీ చిక్కులో పడ్డారని ఆయన తెలిపారు.. కమెడియన్ ఆలీ సినీ ఇండస్ట్రీలో ఎలాంటి మచ్చలేని నటుడు అని, ఆయన కేవలం కమెడియన్ గానే కాదు కామెడీ విలన్ గా..హీరోగా..కూడా సెట్ అవుతారని,ఆయనపై పొగడ్తల వర్షం కురిపించారు శ్రీశైలం యాదవ్. ప్రస్తుతం ఆయన మాట్లాడిన మాటలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి.