నాని తాజాగా సరిపోదా శనివారం అనే సినిమాలో
హీరో గా నటించాడు. ఈ
మూవీ లో
ప్రియాంక అరుల్
మోహన్ హీరోయిన్ గా నటించగా ...
వివేక్ ఆత్రేయ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఎస్ జై
సూర్య ఈ
మూవీ లో విలన్ పాత్రలో నటించాడు. ఇకపోతే మొదటి నుండి కూడా ఈ చిత్ర బృందం ఈ
సినిమా నుండి విడుదల చేసిన ప్రచార చిత్రాలు అన్ని కూడా ప్రేక్షకులను అద్భుతంగా ఆకట్టుకుంటూ ఉండటంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. కానీ ఆ స్థాయిలో ఈ
మూవీ కి ఫ్రీ రిలీజ్ బిజినెస్ మాత్రం జరగలేదు. ఈ
మూవీ మీడియం రేంజ్ హీరోలకు జరిగిన ప్రి రిలీజ్ బిజినెస్ల విషయంలో చాలా వెనకబడిపోయింది.
లైగర్
మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా 808.40 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ జరగగా ,
విజయ్ దేవరకొండ హీరోగా రూపొందిన
ఖుషి మూవీ కి 52.50 కోట్ల ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.
దసరా మూవీ కి 50 కోట్లు , డబల్ ఇస్మార్ట్
మూవీ కి 48 కోట్లు , స్కంద
మూవీ కి 46.20 కోట్లు , ఫ్యామిలీ స్టార్
మూవీ కి 43 కోట్లు ,
అఖిల్ మూవీ కి 42 కోట్ల ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఇక
నాని హీరోగా రూపొందిన సరిపోదా శనివారం సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా 41 కోట్ల ప్రియ రిలీజ్ బిజినెస్ జరిగింది.
భారీ అంచనాలు ఉన్నా కూడా మీడియం రేంజ్ హీరోలలో అత్యధిక ప్రి రిలీజ్ బిజినెస్ ను జరుపుకున్న సినిమాల లిస్టులో సరిపోదా శనివారం
సినిమా 8 వ స్థానంలో నిలిచింది. మరి ఈ
సినిమా ఎలాంటి టాక్ ను తెచ్చుకుంటుందో ... ఏ స్థాయి కలెక్షన్లను వసూలు చేస్తుందో తెలియాలి అంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే. ఇకపోతే గతంలో
నాని హీరోగా
వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో అంటే సుందరానికి అనే
మూవీ రూపొందింది. ఈ
మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర పర్వాలేదు అనే స్థాయి విజయాన్ని అందుకుంది.