బాలీవుడ్ నటీనటులు శ్రద్ధాకపూర్, రాజ్‌కుమార్ రావుజంటగా నటించిన రీసెంట్ మూవీ ‘స్త్రీ 2’ . కామెడీ హారర్ ఫిల్మ్‌గా తెరకెక్కిన ఈ చిత్రానికి అమర్ కౌశిక్ దర్శకత్వం వహించారు. ఆగస్టు 15న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్‌తో విజయాన్ని సొంతం చేసుకుంది. విడుదలైన 8 రోజుల్లోనే రూ.400 కోట్లు వసూలుచేసి.. అతి తక్కువ సమయంలో ఈ ఘనత సాధించిన బాలీవుడ్ మూవీగా నిలిచింది. కమర్షియల్ చిత్రాలు బాలీవుడ్ బాక్సాఫీస్‌ను రూల్ చేస్తున్న సమయంలో విభిన్నమైన కాన్సెప్ట్‌తో దర్శకుడు అమర్ కౌశిక్ స్త్రీ అనే మంచి వినోదాత్మక చిత్రాన్ని అందించారు. 2018లో విడుదలైన ఈ సూపర్ నేచురల్
కామెడీ, హారర్ ఫిల్మ్ బాక్సాఫీస్ వద్ద విజయాన్ని అందుకుంది. తమ గ్రామాన్ని పట్టిపీడిస్తున్న దెయ్యాన్ని పట్టుకోవడం కోసం వాళ్లు చేసే ప్రయత్నాలు సినీప్రియులను ఉత్కంఠకు గురిచేశాయి. దీంతో ఈ సినిమా కాసుల వర్షం కురిపించింది. సుమారు రూ.25 కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా రూ.181 కోట్లు వసూళ్లు రాబట్టింది. 2 ఇప్పటికే ఓపెనింగ్ డేన ఫైటర్, కల్కి 2898 ఏడీ (హిందీ) వసూళ్లను అధిగమించడంతోపాటు ఈ ఏడాది హిందీ సినిమాలో బిగ్గెస్ట్ ఓపెనర్‌గా నిలిచింది. తాజాగా మరో అరుదైన ఫీట్‌ను నమోదు చేసింది. ఈ మూవీ కేజీఎఫ్ 2 లైఫ్ టైం హిందీ వెర్షన్ కలెక్షన్లను అధిగమించింది. కేజీఎఫ్ 2 హిందీ వెర్షన్
రూ.435 కోట్లు గ్రాస్.. కాగా స్త్రీ 2 ఇండియావైడ్‌గా రూ.442 కోట్లు వసూళ్లు రాబట్టి రికార్డు క్రియేట్ చేసింది. అంతేకాదు భారత్‌లో యానిమల్, పఠాన్, గాదర్ 2 లైఫ్ టైం వసూళ్లను కూడా సులభంగా అధిగమించే అవకాశాలున్నాయని ట్రేడ్ పండితులు అంచనాలు వేస్తున్నారు. మరి శ్రద్దాకపూర్ స్త్రీ.. త్వరలో షారుఖ్ ఖాన్ ఇండస్ట్రీ హిట్ జవాన్ ఇండియా గ్రాస్ రూ.593 కోట్లు (హిందీ వెర్షన్)ను క్రాస్ చేస్తుందా..? అనేది చూడాలి. స్త్రీ 2 రాబోయే రోజుల్లో ఎలాంటి ట్రెండ్ క్రియేట్ చేస్తుందో చూడాలంటున్నారు సినీ జనాలు...!!