ఒకప్పుడు తన వరుస సినిమాలతో టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ గా మారిన పూజ హెగ్డే ప్రస్తుతం ఆఫర్ల కోసం వెతుకులాడే పరిస్థితి ఎదురవుతోంది.ఈ ముద్దుగుమ్మ అప్పట్లో వచ్చిన అవకాశాలను పక్కకు నెట్టేసి బాలీవుడ్లో రానిద్దామని వెళ్ళింది.కానీ బాలీవుడ్ లో ఈమె చేసిన సినిమాలు ఫ్లాప్ అవ్వడంతో అక్కడ ఈమెని అసలు హీరోయిన్ గా ఏ సినిమాలో కూడా తీసుకోవడానికి ఇష్టపడడం లేదు.దాంతో మళ్లీ సౌత్ ఇండస్ట్రీ మీదే ఫోకస్ పెంచింది. ఇక అప్పట్లో గుంటూరు కారం,ఉస్తాద్ భగత్ సింగ్ వంటి సినిమాలను రిజెక్ట్ చేసి మరి బాలీవుడ్ సినిమాల కోసం వెళ్ళింది. కానీ అక్కడ రిజల్ట్ మాత్రం ఏమీ లేదు. ఇక ప్రస్తుతం పూజ హెగ్డే చేతిలో తమిళ్ హీరో సూర్య మూవీలో అవకాశం ఉంది.అలాగే సాయిధరంతేజ్ గంజా శంకర్ సినిమాలో కూడా ఈ ముద్దుగుమ్మ హీరోయిన్గా చేస్తుంది.
అయితే అవకాశాలు లేకపోవడంతో ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ ప్రపంచమంతా చుట్టేస్తు తెగ ఎంజాయ్ చేస్తోంది.అయితే రీసెంట్గా అమెరికా వెళ్లిన ఈ ముద్దుగుమ్మ అమెరికాలో తెగ ఎంజాయ్ చేస్తోంది.అమెరికాలో ఈ ముద్దుగుమ్మ తిరిగిన ఫోటోలను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటూ అభిమానులను ఫిదా చేస్తోంది.అయితే తాజాగా ఈ హీరోయిన్ కాలిఫోర్నియాలోని లాస్ ఏంజెల్స్ కి వెళ్లిన వెకేషన్ ఫోటోలను షేర్ చేసింది.
అయితే ఈ ఫొటోస్ చూసి కొంతమంది ఇండస్ట్రీ జనాలు పూజ హెగ్డే ప్రియుడుతోనే అమెరికా వెకేషన్ కి వెళ్ళిందని,ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ ప్రియుడుతో రొమాంటిక్ వెకేషన్ ని ఎంజాయ్ చేస్తోంది అంటూ గుసగుసలు పెట్టుకుంటున్నారు. మరి ఫిలిం సర్కిల్స్ లో వినిపిస్తున్న రూమర్ లో ఎంత నిజం ఉందో కానీ ప్రస్తుతం ప్రియుడితో పూజ హెగ్డే వెకేషన్ కి సంబంధించిన వార్తలు మీడియాలో వైరల్ గా మారాయి. అయితే గత కొద్ది రోజులుగా పూజ హెగ్డే బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన రోహన్ మెహ్రాతో డేటింగ్ చేస్తుందన్న సంగతి మనకు తెలిసిందే.