కోట్లిచ్చిన నీ కొడుకుతో సినిమా చేయను.. నాగార్జునని దారుణంగా అవమానించిన డైరెక్టర్.?

Pandrala Sravanthi
నాగార్జున ఇద్దరు కొడుకులు ఇండస్ట్రీలో హీరోలుగా రాణిస్తున్నారు. ఇక ఈ ఇద్దరిలో పెద్దకొడుకు నాగచైతన్యకు ఎంతో అంత గుర్తింపు ఇండస్ట్రీలో ఉంది.కానీ చిన్న కొడుకు అఖిల్ చేసిన సినిమాలు మాత్రం పూర్తిగా ప్లాప్ అయ్యాయి. ఇక మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా హిట్ అయితే అది కూడా అఖిల్ ఖాతాలో పడలేదు.అది పూజా హెగ్డే ఖాతాలోనే పడింది. అలా స్టార్ హీరో అవుదామని ఇండస్ట్రీలోకి వచ్చిన అఖిల్ కి అన్ని సినిమాలు డిజాస్టర్ అవ్వడంతో ఇయన్నీ హీరోగా పెట్టి సినిమా తీయడానికి కూడా డైరెక్టర్ ఎవరు ముందుకు రావడం లేదు.అయితే గతంలో ఓ డైరెక్టర్  నీ కొడుకుతో కోట్లు ఇచ్చినా కూడా సినిమా తీయనని నాగార్జున మొహం మీదే చెప్పేశారట.ఇక ఆ డైరెక్టర్ ఎవరో కాదు పాన్ ఇండియా దర్శకుడు రాజమౌళి.. దర్శకధీరుడు రాజమౌళిని అక్కినేని నాగార్జున ఓసారి ఇంటికి వెళ్లి మరీ  ఒక విషయంలో రిక్వెస్ట్ చేశారట. అదేంటంటే.. అక్కినేని అఖిల్ ని మీరే హీరోగా ఇండస్ట్రీకి పరిచయం చేయాలి.. 

పూర్తి బాధ్యతలు మీ మీదే ఉన్నాయి అంటూ చెప్పారట.కానీ రాజమౌళి మాత్రం అఖిల్ ని ఇండస్ట్రీకి హీరోగా పరిచయం చేయడం నావల్ల కాదు.. మీరు కోట్లు ఇచ్చిన కూడా హీరోగా నేను ఆయన్ని ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ చేయలేను. ఎందుకంటే ఆయన కటౌట్ కి తగ్గ కథ నా దగ్గర లేదు.. ఆయన సినిమాల్లోకి వచ్చాక ఆయన సినిమాలు చూసి సరైన కథ నేను రాసుకుంటాను.ఆ టైంలో ఏదైనా అవకాశం ఉంటే అఖిల్ తో సినిమా చేస్తాను.కానీ ఇప్పుడు అఖిల్ తో సినిమా చేయడం నావల్ల కాదు అని చేతులెత్తేసారట.

అలా రాజమౌళి ఇంటికి వెళ్లి మరీ నాగార్జున తన కొడుకును ఇండస్ట్రీకి పరిచయం చేయమని అడిగినా కూడా మొహం మీదే మీరు కోట్లు ఇచ్చిన ఆ పని చేయను సార్ అంటూ దారుణంగా అవమానించారట.అయితే ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ అప్పటి రూమర్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవ్వడంతో చాలామంది నెటిజన్స్ రాజమౌళి చేతిలో పడితే అఖిల్ స్టార్ హీరో అయ్యేవారు కావచ్చు. కానీ అఖిల్ ఇప్పటివరకు ఎన్ని సినిమాలు చేసినా ఒక్కటి కూడా హిట్ అవ్వలేదు. ఒకవేళ ఈయనతో సినిమా చేస్తే రాజమౌళి కి కూడా ఫ్లాప్ వచ్చేది కావచ్చు అంటూ కామెంట్స్ పెడుతున్నారు అక్కినేని హేటర్స్

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: