నందమూరి ఫ్యామిలీలో భగ్గుమన్న విభేదాలు.. బాలయ్య 50 ఏళ్ల సినీ వేడుకకు ఆ హీరోలకు నో ఎంట్రీ.?

Pandrala Sravanthi
నందమూరి బాలకృష్ణ సినిమా ఇండస్ట్రీలోకి తాతమ్మ కల అనే మూవీ ద్వారా ఎంట్రీ ఇచ్చారు.అలా బాలకృష్ణ సినీ ప్రస్థానం మొదలై 50 ఏళ్లు పూర్తవడంతో బాలకృష్ణ 50 ఏళ్ల సినీ వేడుకని అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు సినీ ఇండస్ట్రీలోని ప్రముఖులు. అయితే ఇప్పటికే బాలకృష్ణ 50 ఏళ్ల సినీ వేడుకలకు ఎంతో మంది ప్రముఖులకు ఆహ్వానాలు అందాయి. అలా తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అయినటువంటి రేవంత్ రెడ్డి,చంద్రబాబుతో పాటు  పవన్ కళ్యాణ్ మెగా ఫ్యామిలీలో ఉన్న చిరంజీవితో పాటు అందరికీ ఈ ఆహ్వానం అందింది. అలాగే అల్లు అరవింద్, అల్లు అర్జున్ లకి కూడా ఆహ్వానం అందిన ఫోటోలు తాజాగా మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.ఇక వీళ్లే కాకుండా బాలీవుడ్ స్టార్ హీరో అమితాబ్ బచ్చన్ తో పాటు సినిమా ఇండస్ట్రీలోని ఎంతోమంది ప్రముఖులు ఈ వేడుకకు రాబోతున్నారు. బాలకృష్ణ 50 ఏళ్ల సినీ వేడుక సెప్టెంబర్ ఒకటిన సాయంత్రం అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఇప్పటికే ఈ వేడుకకు సంబంధించి ఎన్నో పనులు పూర్తి చేస్తున్నారు. 

అయితే ఇండస్ట్రీలో ఉన్న ఎంతోమందికి బాలయ్య 50 ఏళ్ల వేడుకకు ఆహ్వానం అందింది.కానీ నందమూరి ఫ్యామిలీ లో ఉన్న ఇద్దరు హీరోలకు మాత్రం ఇంకా ఆహ్వానం అందలేదు. ఇక ఆ హీరోలు ఎవరో మీ అందరికీ తెలుసు. వాళ్లేనండి.. హరికృష్ణ కొడుకులు  కళ్యాణ్ రామ్, జూనియర్ ఎన్టీఆర్ లు.అయితే గత కొద్ది రోజులుగా బాలకృష్ణకి కళ్యాణ్ రామ్, జూనియర్ ఎన్టీఆర్ లకి మధ్య కోల్డ్ వార్ జరుగుతోందని,వీరి మధ్య మాటలు లేవని తెలుస్తోంది. కానీ టిడిపి కూటమి విజయం సాధించిన సమయంలో ఎన్టీఆర్ సోషల్ మీడియా వేదికగా చంద్రబాబు, లోకేష్,పవన్ కళ్యాణ్ లతో పాటు బాలకృష్ణ కి బాలకృష్ణ అల్లుడికి కూడా విషెస్ తెలిపారు. కానీ అంతకు ముందు తారక రత్న మరణించిన సమయంలో బాలకృష్ణ వారిద్దరిని పట్టించుకోలేదు.అలాగే ఎన్టీఆర్ శత జయంతి  ఉత్సవాలకు కూడా ఎన్టీఆర్ మనవళ్ళు అయిన జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ లు హాజరవ్వరలేదు.


దానికి కారణం బాలకృష్ణ అనే టాక్ ఇండస్ట్రీలో వినిపించింది.అయితే తాజాగా బాలకృష్ణ 50 ఏళ్ల సినీ వేడుకకు కూడా వాళ్ళిద్దరికీ ఆహ్వానం అందలేదని తెలుస్తోంది.  ఎందుకంటే ఒకవేళ ఆహ్వానం అందితే ఇప్పటికే వారికి సంబంధించిన ఫోటోలు మీడియాలో చక్కర్లు కొట్టేవి. కానీ ఇప్పటివరకు వారికి ఆహ్వానం అందలేదని, బాలకృష్ణ వారిని పిలవద్దని చెప్పినట్టు టాలీవుడ్ లో టాక్ వినిపిస్తోంది.ఇక ఈ ఒక్క విషయంతో నందమూరి ఫ్యామిలీలో ఉన్న విభేదాలు భగ్గుమంటాయని, బాలకృష్ణ 50 ఏళ్ల సినీ వేడుకతో ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ కి బాలకృష్ణ తో ఉన్న గొడవలు బయటపడతాయని తెలుస్తోంది. అయితే ఇప్పటివరకు ఆహ్వానం  అయితే అందలేదు. మరి రాబోయే రెండు మూడు రోజుల్లో ఆహ్వానం అందుతుందో లేదో చూడాలి

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: