అల్లు ఫ్యామిలీని ఫాలో అవుతున్న మైత్రి డిస్ట్రిబ్యూషన్ సంస్థ.. సక్సెస్ అయ్యనా..?

Pulgam Srinivas
కొన్ని సంవత్సరాల క్రితం రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా సినిమా టికెట్ రేట్లు చాలా తక్కువగా ఉండేవి. దానితో సామాన్య ప్రజలు కూడా సినిమాను చూడడం పెద్ద ఇబ్బంది అయిన విషయంగా ఉండేది కాదు. కానీ కరోనా వల్ల సినిమా ఇండస్ట్రీ కుదేలయ్యింది. కరోనా సమయంలో ప్రేక్షకులు ఓ టీ టీ లకు అలవాటు పడటంతో సినిమా ధియేటర్లకు వచ్చే జనాల సంఖ్య కూడా చాలా వరకు తగ్గింది. కాకపోతే సినిమా బడ్జెట్లు మాత్రం ఏమీ తగ్గలేదు. దానితో సినిమా నటులు , నిర్మాతలు , దర్శకులు అంతా కూడా ప్రభుత్వాలను సినిమా వ్యాయం పెరిగింది. సినిమాను థియేటర్లలోకి వచ్చి చూసే జనాల సంఖ్య తగ్గింది.

కాబట్టి కాస్త టికెట్ ధరలు పెంచినట్లు అయితే సినిమాకు , సినిమా పరిశ్రమకు మంచిది అని ప్రభుత్వాలను కోరాయి. వారు కూడా సినిమా టికెట్ రేట్లను పెంచుకునేందుకు వీళ్లను కల్పిస్తూ వస్తున్నారు. ఇకపోతే కొన్ని మూవీ బృందాలు మాత్రం చాలా తక్కువ టికెట్ ధరలతో సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. కొన్ని రోజుల క్రితం అల్లు శిరీష్ హీరోగా బడ్డీ అనే సినిమా రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ ని అత్యంత తక్కువ ధరలకే థియేటర్లలో విడుదల చేశారు. తక్కువ ధరలతో సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ భారీ విజయాన్ని మాత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకోలేకపోయింది. ఇకపోతే మైత్రి మూవీ సంస్థ కూడా ఈ ఫార్ములాను ఫాలో అవుతుంది.

మైత్రి మూవీ సంస్థ వారు విక్రమార్క అనే సినిమాను నైజాం ఏరియాలో విడుదల చేస్తున్నారు. ఇకపోతే ఈ సినిమా యొక్క నైజాం టికెట్ ధరలను మైత్రి సంస్థ ప్రకటించింది. ఈ మూవీ నైజాం ఏరియా టికెట్ ధరలను సింగిల్ స్క్రీన్ థియేటర్లలో 110 రూపాయలు గాను , మల్టీప్లెక్స్ థియేటర్లలో 112 రూపాయలుగాను మైత్రి సంస్థ ఫిక్స్ చేసింది. మరి అత్యంత తక్కువ టికెట్ ధరలతో విడుదల అవుతున్న ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: