ఆగస్టు 9వ తేదీన వంశీ దర్శకత్వంలో రూపొందిన కమిటీ కుర్రాళ్ళు అనే సినిమా విడుదల కాగా , ఆగస్టు 15వ తేదీన ఆయ్ అనే సినిమా విడుదల అయింది. ఈ రెండు సినిమాలు కూడా చిన్న సినిమాలు గా విడుదల అయ్యి బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్ద విజయాలను అందుకున్నాయి. మరి ఈ రెండు సినిమాలకు ఇప్పటివరకు బాక్స్ ఆఫీస్ దగ్గర ఎన్ని కోట్ల కలెక్షన్లు వచ్చాయి. ఎన్ని లాభాలు వచ్చాయి అనే వివరాలను తెలుసుకుందాం.
కమిటీ కుర్రాళ్ళు మూవీకి సంబంధించిన 20 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ఇప్పటివరకు కంప్లీట్ అయింది. ఈ 20 రోజుల్లో ఈ సినిమాకు నైజాం ఏరియాలో 4.05 కోట్ల కలెక్షన్లు రాగా , సీడెడ్ ఏరియాలో 1.02 కోట్లు , ఆంధ్ర ఏరియాలో 3.65 కోట్ల కలెక్షన్లు వచ్చాయి. మొత్తంగా ఈ సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 8.72 కోట్ల షేర్ , 15.90 కోట్ల గ్రాస్ కలెక్షన్లు వచ్చాయి. ఈ మూవీ కి కర్ణాటక , రెస్ట్ ఆఫ్ ఇండియా మరియు ఓవర్సీస్ లలో కలుపుకొని 77 లక్షల కలెక్షన్లు వచ్చాయి. మొత్తంగా ఈ మూవీ కి 20 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 9.49 కోట్ల షేర్ , 17.60 కోట్ల గ్రాస్ కలెక్షన్లు వచ్చాయి. ఈ మూవీ కి 3 కోట్ల ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరగగా ఈ మూవీ 3.25 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బాక్స్ ఆఫీస్ బరిలోకి దిగింది. ఈ మూవీ ఇప్పటికే 6.24 కోట్ల లాభాలను అందుకొని బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది.
ఆయ్ మూవీ కి సంబంధించిన 14 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ఇప్పటివరకు కంప్లీట్ అయింది. ఈ 14 రోజుల్లో ఈ సినిమాకు నైజాం ఏరియాలో 3.05 కోట్ల కలెక్షన్లు రాగా , సీడెడ్ ఏరియాలో 91 లక్షలు , ఆంధ్ర ఏరియాలో 2.86 కోట్ల కలెక్షన్లు వచ్చాయి. మొత్తంగా ఈ మూవీ కి 14 రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో 6.82 కోట్ల షేర్ , 12.60 కోట్ల గ్రాస్ కలెక్షన్లు వచ్చాయి. ఈ మూవీకి కర్ణాటక , రెస్ట్ ఆఫ్ ఇండియా మరియు ఓవర్సీస్ లలో కలుపుకొని 68 లక్షల కలెక్షన్లు వచ్చాయి. ఇక ఈ మూవీకి ప్రపంచవ్యాప్తంగా 7.50 కోట్ల షేర్ , 14.10 కోట్ల గ్రాస్ కలెక్షన్ వచ్చాయి. ఈ మూవీ కి 3.25 కోట్ల ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరగగా 3.50 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బాక్స్ ఆఫీస్ బరిలోకి దిగింది. ఈ మూవీ ఇప్పటికే 4 కోట్ల లాభాలను అందుకుంది.