ఈ మధ్యకాలం లో చాలా మంది సెలబ్రిటీలు వారికున్న వ్యాధులను ఒక్కొక్కరిగా బయట పెడుతున్నారు. అలా ఇప్పటికే సమంత, కల్పిక గణేష్, పూనమ్ కౌర్ వంటి నటీమణులతో పాటు కొంత మంది హీరోలు కూడా తమకి ఉన్న వ్యాధి కి సంబందించిన వివరాలు బయట పెట్టారు. అయితే తాజాగా తమన్నా బాయ్ ఫ్రెండ్ విజయ్ వర్మ కూడా తనకున్న వ్యాధి గురించి అందరి ముందు చెప్పేసారు.ఇక ఆయనకున్న వ్యాధి పేరు ఏంటో కాదు బొల్లి.. విజయ్ వర్మ కు చాలా సంవత్సరాల నుండి విటిలిగో వ్యాధి ఉందట. అయితే ఆ వ్యాధి గురించి బయట పడితే తనకి అవకాశాలు తగ్గిపోతాయని, నా నటన చూడకుండా ముందుగా ఆ వ్యాధి గురించే అందరూ మాట్లాడుకుంటారని విజయ్ వర్మ ఈ విషయాన్ని బయట పెట్టలేదట.
అయితే సక్సెస్ సాధించాక ఈ విషయాన్ని బయట పెట్టాల్సి వచ్చిందని ,మొదట్లో నేను ఈ వ్యాధి గురించి ప్రతిసారి ఆలోచించే వాడిని కానీ ఎప్పుడైతే నాకు సక్సెస్ వచ్చిందో అప్పుడే దాన్ని ఆలోచించడం మానేశాను. అయితే ఇప్పుడు నాకున్న వ్యాధి గురించి చెప్పడానికి కారణం ప్రస్తుతం ఉన్న జనరేషన్ దీని గురించి అర్థం చేసుకుంటారనే ఉద్దేశం తో నేను ఈ విషయాన్ని బయట పెట్టాను అంటూ తనకు ఉన్న బొల్లి వ్యాధి గురించి విజయ్ వర్మ బహిరంగంగానే బయట పెట్టారు.
ప్రస్తుతం ఈ విషయం తెలిసిన చాలా మంది నెటిజన్స్ విజయ్ వర్మ కి ఇంత పెద్ద వ్యాధి పెట్టుకొని ఇన్ని రోజులు ఎలాంటి మాయ మచ్చ లేదు అన్నట్లుగా ఉన్నారా.. అసలు ఈ వ్యాధి గురించి తమన్నా కైనా తెలుసా లేదా.. తమన్నాకీ వ్యాధి గురించి చెప్పకుండానే పూర్తిగా వాడేసుకున్నారా అంటూ కొంతమంది నెగిటివ్ కామెంట్లు పెడుతున్నారు.కానీ మరి కొంతమంది మాత్రం చాలామంది ఇండస్ట్రీ వాళ్ళు ఇలాంటి విషయాన్ని బయట పెట్టడానికి ఇష్టపడరు. కానీ మీరు మాత్రం ధైర్యంగా ఈ విషయాన్ని బయటపెట్టారు అంటూ మెచ్చుకుంటున్నారు.