‘మనసంతా నువ్వే’ యాక్టర్ ఇలా అయ్యిందేంటి?
మనసంతా నువ్వే మూవీతో పాటుగా ఇంకొన్ని సినిమాల్లో శిరీష హీరోలకు చెల్లెలుగా నటించింది. అందం, అభినయంతో అందర్నీ ఆకట్టుకుంది. మెగాస్టార్ చిరంజీవి, తారక్, పవన్, జగపతి బాబు, మాస్ మహరాజా రవితేజలాంటి స్టార్ హీరోలకు శిరీష చెల్లెలుగా నటించి ఇండస్ట్రీలో ఎంతో గుర్తింపు తెచ్చుకుంది. తన సినీ కెరీర్ పీక్స్‌లో ఉండగానే శిరీష పెళ్లి చేసుకుని సెటిల్ అయ్యింది. ఆ తర్వాత సినిమాలకు దూరమైనప్పటికీ ఇప్పుడిప్పుడే మళ్లీ సినిమా ప్రయత్నాలు స్టార్ట్ చేసింది.
బుల్లితెరపై ఊర్వశివో..రాక్షసివో అనే సీరియల్‌లో శిరీష నటిస్తోంది. అందులో హీరోకు తల్లిగా చేస్తోంది. అదేవిధంగా సీతా రాముడి కట్నం సీరియల్‌లో కూడా ఓ క్యారెక్టర్ చేస్తోంది. శిరీష కేవలం నటి మాత్రమే కాదు. ఆమె డబ్బింగ్ కూడా చెబుతుంది. టీవీ ప్రజెంటర్‌గా కూడా శిరీష రాణిస్తోంది. ప్రస్తుతం శిరీష ఓ సినిమాలో కూడా నటిస్తోందట. మన్మయి అనే మూవీలో కీ రోల్ చేస్తోంది. దాంతో పాటు ఆమె చేతిలో రెండు సినిమాలున్నాయట. నెట్టింట ఫుల్ బిజీగా ఉండే శిరీష తన ప్రొఫెషనల్ ఫోటోలను కూడా షేర్ చేస్తూ ఉంటుంది. తాజాగా ఆమె పోస్టు చేసిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.