విక్రమ్ : ఆ హీరోయిన్ కోసం మణిరత్నంను ఎంతో రిక్వెస్ట్ చేశా..!!
విక్రమ్ - అభిషేక్ బచ్చన్ - ఐశ్వర్యరాయ్ కాంబోలో తెరకెక్కిన తొలి చిత్రం 'రావన్' . మణిరత్నం దర్శకత్వం వహించారు. ఈ సినిమా క్లైమాక్స్‌లో విక్రమ్ పాత్ర మృతి చెందుతుంది. ఇదే కాంబోలో ఇటీవల వచ్చిన చిత్రం 'పొన్నియిన్ సెల్వన్'. చోళుల వైభవం, ఆ సామ్రాజ్య పతనానికి కారణమైన విషయాలను తెలియజేస్తూ దీనిని రూపొందించారు. ఇందులో ఆదిత్య కరికాలన్‌గా విక్రమ్, నందినిగా ఐశ్వర్యరాయ్ నటించారు. ఇద్దరూ ప్రేమించుకున్నప్పటికీ అనివార్య కారణాల వల్ల నందిని మరో వ్యక్తిని పెళ్లాడాల్సి వస్తుంది. ఆదిత్య కరికాలన్ పాత్ర మృతితో ఈ సినిమా ముగుస్తుంది. 'తంగలాన్' విషయానికి వస్తే.. ఆగస్టు 15న ఈ చిత్రం దక్షిణాదిలో విడుదలై మంచి టాక్ సొంతం చేసుకుంది. ఈనేపథ్యంలోనే శుక్రవారం దీనిని హిందీలో విడుదల చేశారు.
ఈ నేపథ్యంలో నే విక్రమ్ ఈ విధంగా స్పందించారు "నేను ఇప్పటివరకు చాలా చిత్రాలు చేశాను. అందులో కష్టమైనది కోబ్రా. అనుకున్నస్థాయిలో ఆడలేదు. కానీ ఒక నటుడిగా నాకు సంతృప్తినిచ్చింది. కొన్నిసార్లు సినిమాకు ప్రశంసలు వచ్చినా కలెక్షన్స్ రావు. ఏదేమైనా కోబ్రాలో నేను చేసిన ఎన్నో సీన్స్ ఛాలెంజింగ్‌గా అనిపించాయి. ఇకపోతే నాకు ఒకే రకమైన పాత్రలంటే ఆసక్తి ఉండదు. నేను అలా చేస్తే నా అభిమానులు కూడా నిరాశ పడతారు. ఇండస్ట్రీలో ఉన్న కొంతమంది మాత్రమే భిన్నంగా ప్రయత్నిస్తుంటారు. ఇక మణిరత్నం పొన్నియిన్ సెల్వన్ మంచి సక్సెస్ సాధించడంతో పాటు 4 జాతీయ అవార్డులను అందుకుంది. అది నాకెంతో సంతోషాన్నిచ్చింది. కానీ నాకు కూడా అవార్డ్ వచ్చి ఉంటే ఇంకా బాగుండేది." అని చెప్పుకొచ్చారు.