టాలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ కలిగిన హీరోలలో ఒకరు అయినటువంటి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప పార్ట్ 2 మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ లో మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ టాలెంటెడ్ నటిమని రష్మిక మందన హీరోయిన్గా నటిస్తూ ఉండగా ... తెలుగు సినీ పరిశ్రమలో టాప్ డైరెక్టర్లలో ఒకరు అయినటువంటి సుకుమార్ ఈ మూవీ కి దర్శకత్వం వహిస్తున్నాడు. మలయాళ నటుడు ఫాహద్ ఫజిల్ ప్రతి నాయకుడి పాత్రలో నటిస్తున్న ఈ మూవీ లో అనసూయ , సునీల్ , రావు రమేష్ ముఖ్య పాత్రలలో కనిపించబోతూ ఉండగా ... రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఈ మూవీ కి సంగీతం అందిస్తున్నాడు.
మైత్రి సంస్థ వారు ఈ మూవీ ని నిర్మిస్తున్నారు. ఇకపోతే ఈ సినిమాను కొంత కాలం క్రితం ఆగస్టు 15 వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అందుకు అనుగుణంగా ప్రచారాలను కూడా నిర్వహించారు. కానీ చివరగా ఈ సినిమాను ఆగస్టు 15 వ తేదీన కాకుండా డిసెంబర్ 6 వ తేదీన విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఇక డిసెంబర్ 6 వ తేదీన ఈ సినిమా విడుదలను ప్రకటించిన తర్వాత కూడా ఈ మూవీ షూటింగ్ అంత స్పీడ్ గా జరగకపోవడంతో ఈ మూవీ మళ్లీ పోస్ట్ పోన్ కానున్నట్లు వార్తలు వచ్చాయి. ఇక తాజాగా ఈ సినిమా నిర్మాత అయినటువంటి రవి శంకర్ పాత్రికేయులతో ముచ్చటించాడు.
అందులో భాగంగా పుష్ప పార్ట్ 2 మూవీ కి సంబంధించిన చాలా అప్డేట్లను తెలియజేశాడు. తాజాగా రవి శంకర్ మాట్లాడుతూ ... సెప్టెంబర్ 2 వ తేదీ వరకు పుష్ప 2 ఫస్ట్ ఆఫ్ ఎడిటింగ్ కాపీ వచ్చేస్తుంది. అక్టోబర్ 6 వ తేదీ వరకు సెకండాఫ్ ఎడిటింగ్ కాపీ కూడా వచ్చేస్తుంది. నవంబర్ 20 వ తేదీన ఫైనల్ కాపీ వచ్చేస్తుంది. నవంబర్ 25 వ తేదీన సెన్సార్ ఫార్మాలిటీస్ కంప్లీట్ అవుతాయి. డిసెంబర్ 6 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా సినిమా విడుదల అవుతుంది అని పుష్ప పార్ట్ 2 మూవీ కి సంబంధించిన చాలా అప్డేట్లను కూడా రవి శంకర్ తాజాగా చెప్పుకొచ్చాడు.