శృంగార తారగా సౌత్ ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించిన వారిలో షకీలా ముందుంటుంది.. షకీలా తన భారీ అందాలతో ఎన్నో హిట్ సినిమాల్లో నటించింది.ముఖ్యంగా ఈమె సినిమాలు విడుదలవుతున్నాయి అంటే చాలామంది స్టార్ హీరోలు సైతం తమ సినిమాలను వాయిదా వేసుకునే వారట.అలా అప్పట్లో షకీల సినిమాలకి అంత క్రేజ్ ఉండేదట.ఇక షకీలా శృంగార తారగా ముద్ర పడ్డప్పటికీ ఆమె మనసు మాత్రం వెన్న.. సంపాదించిన డబ్బులన్ని కొట్టేసి సొంతవాళ్లే మోసం చేసిన కూడా ఏమీ అనలేని దుస్థితిలో ఆమె చాలా సంవత్సరాలు బతికింది. ప్రస్తుతం తన వాళ్ళు ఎలాంటివారో తెలుసుకొని వారికి దూరంగా బతుకుతుంది. అయితే అలాంటి షకీల తాజాగా మాలీవుడ్లో సంచనాలు సృష్టిస్తున్న హేమ కమిటీ రిపోర్ట్ కి మద్దతు తెలిపింది.కేవలం మాలివుడ్ లోనే కాదు టాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా క్యాస్టింగ్ కౌచ్ ఎక్కువే అంటూ సంచలన కామెంట్స్ చేసింది..
ఇండస్ట్రీకి కొత్తగా వచ్చే అమ్మాయిలకు అవకాశం కావాలంటే చాలా మంది దర్శక నిర్మాతల హీరోల కోరిక తీర్చాల్సిందే.వారి బెడ్రూంలలోకి వెళ్లాల్సిందే.. అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. అంతే కాదు షకీలా కూడా ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో చాలామంది కోరికలు తీర్చి వారికి పడక సుఖం ఇచ్చింది అనే టాక్ ఉంది. అంతేకాదు ఎంతోమంది షకీలాను కోరికలు తీర్చుకోవడానికి వాడుకున్నారని,ఆమె చాలా ఇంటర్వ్యూలలో బయట పెట్టింది.
అయితే తాజాగా ఈమె కేవలం మాలీవుడ్ లోనే కాదు టాలీవుడ్ లో కూడా ఈ క్యాస్టింగ్ కౌచ్ ఎక్కువగానే ఉంటుంది అని సంచలన కామెంట్లు చేయడంతో ఇంతకీ షకీలాని అంతలా ఇబ్బంది పెట్టింది ఎవరబ్బా అని చాలామంది నెటిజన్స్ కామెంట్లు పెడుతున్నారు.అయితే షకీలా తెలుగులో కూడా కొన్ని సినిమాల్లో నటించింది. అలా సినిమాలు చేసిన సమయంలో ఓ స్టార్ డైరెక్టర్ షకీలాని అవకాశం ఇస్తానని చెప్పి తన పక్కలోకి రమ్మన్నారట.. ఇక అప్పట్లో ఈ విషయం టాలీవుడ్ లో సంచలనం సృష్టించింది.అయితే తాజాగా షకీలా ఆ డైరెక్టర్ ని ఉద్దేశించే టాలీవుడ్ లో కూడా క్యాస్టింగ్ కౌచ్ ఉంది అని మాట్లాడింది కావచ్చు అని నెటిజన్స్ కామెంట్లు పెడుతున్నారు