ఈ సంవత్సరం ముంబైలో టాప్ 10 లో 1వ స్థానంలో తెలుగు సినిమా.. ఎన్ని కోట్లతోనో తెలుసా..?

Pulgam Srinivas
ముంబై నగరంలో ఎక్కువ శాతం హిందీ సినిమాల డామినేషన్ కనిపిస్తూ ఉంటుంది అనే విషయం మనకు తెలిసిందే. ఈ సంవత్సరం కూడా ముంబై ఏరియాలో హిందీ సినిమాల డామినేషన్ కనిపించింది. కాకపోతే టాప్ 10 సినిమాలలో 9 సినిమాలు కూడా హిందీవే ఉంటే ఒక్క సినిమా మాత్రమే తెలుగుది ఉంది. కానీ ఆ ఉన్న ఒక సినిమా కూడా నెంబర్ వన్ స్థానంలో ఉంది. ఆ సినిమా ఏది ..? ముంబై లో ఎన్ని కలక్షన్లను వసూలు చేసింది అనే వివరాలను తెలుసుకుందాం.

ఈ సంవత్సరం తెలుగు నుండి అత్యంత భారీ అంచనాల నడుమ విడుదల అయిన సినిమాలలో కల్కి 2898 AD మూవీ ఒకటి. ఈ సినిమాలో రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించగా ... దిశా పటాని ఈ మూవీ లో హీరోయిన్ గా నటించింది. విజయ్ దేవరకొండ , దుల్కర్ సల్మాన్ , రాజేంద్రప్రసాద్ , శోభన , మృనాల్ ఠాకూర్ ఈ మూవీలో ముఖ్య పాత్రలలో నటించగా ... అమితా బచ్చన్ , దీపికా పదుకొనే ఈ సినిమాలో అత్యంత కీలక పాత్రలో నటించారు. నాగ అశ్విన్ రూపొందిన ఈ సినిమాను వైజయంతి మూవీస్ , స్వప్న సినిమాస్ బ్యానర్ పై అశ్విని దత్ కూతురు స్వప్న దత్ నిర్మించింది. 

ఈ మూవీ కి విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బాస్టర్ టాక్ వచ్చింది. దానితో ఈ సినిమా 1000 కోట్లకు పైగా కలెక్షన్లను ప్రపంచ వ్యాప్తంగా కొల్లగొట్టింది. ఇది ఇలా ఉంటే ఈ సినిమా ముంబై లో కూడా అదిరిపోయే రేంజ్ రికార్డును నెలకొల్పింది. ఈ సంవత్సరం విడుదల అయిన సినిమాలలో ముంబై లో అత్యధిక కలెక్షన్లను వసూలు చేసిన సినిమాల లిస్టులో ఈ మూవీ నెంబర్ వన్ స్థానంలో నిలిచింది. ఈ మూవీ ముంబై ఏరియాలో 108 కోట్ల గ్రాస్ కలెక్షన్లను వసూలు చేసి ఈ సంవత్సరంలో ముంబై ఏరియాలో అత్యధిక కలెక్షన్లను వసూలు చేసిన సినిమాల లిస్టు లో మొదటి స్థానంలో నిలిచింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: