తంగలాన్ దర్శకుడి మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్.. ఈ సారి అంతకు మించి..!!

murali krishna
కోలీవుడ్ స్టార్ హీరో విక్రమ్ నటించిన లేటెస్ట్ మూవీ తంగలాన్..ఈ సినిమా రీసెంట్ గా రిలీజ్ మంచి కలెక్షన్స్ సాధిస్తూ దూసుకుపోతుంది.విక్రమ్‌- పా.రంజిత్‌ కాంబినేషన్‌లో తెరకెక్కిన తంగలాన్‌ మూవీకి ఆడియన్స్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ లభిస్తుంది.. ఈ సినిమాలో చియాన్ విక్రమ్, మాళవిక పెర్ఫార్మన్స్ సినిమాకే హైలైట్ అని చెప్పవచ్చు.. ఈ సినిమా ఏకంగా రూ. 100 కోట్ల క్లబ్‌లో చేరింది.. ఈమేరకు చిత్ర యూనిట్‌ అధికారికంగా ప్రకటించింది. తాజాగా ఈ సినిమా హిందీ వర్షన్‌తో బాలీవుడ్‌లో విడుదలైంది. ఈ సందర్భంగా డైరెక్టర్‌ పా.రంజిత్‌ తన కొత్త సినిమా గురించి ఆసక్తికర విషయాలు తెలియజేశారు. ఈ సినిమాను హిందీలో స్ట్రెయిట్‌ సినిమాగా తెరకెక్కిస్తున్నట్లు తెలిపారు. ఈ సినిమా స్క్రిప్ట్‌ ఇప్పటికే సిద్ధం చేశానని, దానికి 'బిర్సా ముండా' అనే టైటిల్‌ను కూడా ఫిక్స్‌ చేసినట్లు పా.రంజిత్‌ అధికారికంగా ప్రకటించారు.చిత్ర పరిశ్రమలో పా.రంజిత్‌ది ప్రత్యేక శైలి..సామాజిక అంశాలనే కథాంశాలుగా తీసుకొని వాటికి అందరూ మెచ్చేలా కమర్షియల్‌ తరహాలో సినిమాను తెరకేక్కిస్తుంటారు. అందుకే ఈ దర్శకుడు తీసిన చిత్రాలకు ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంటుంది.ఇప్పుడు ఆయన తెరకెక్కించబోయే బిర్సా ముండా చిత్రం కూడా అదే కోవకు చెందినదిగా చెప్పవచ్చు. అయితే ఈ సినిమాలో ఇందులో నటించబోయే నటీనటుల పేర్లు ఆయన వెల్లడించలేదు.
బిర్సా ముండా అంటే 1875-1900 కాలం నాటి ఆదివాసీ నాయకుడు. ఆయన జీవిత చరిత్ర చాలా ఎమోషనల్‌గా ఉంటుంది.. బిర్సా ముండా 19వ శతాబ్దపు జార్ఖండ్ రాష్ట్రంలో బ్రిటిష్, స్వదేశీ భూస్వాములచే బానిసలుగా ఉన్న గిరిజన ప్రజల కోసం ఎంతగానో పోరాడారు. భారతీయ అటవీ జాతుల స్వాతంత్ర్య సమరయోధుడిగా ఆయనకు మంచి గుర్తింపు ఉంది.ముండా జాతికి చెందిన బిర్సా 19వ శతాబ్దపు చివరి రోజుల్లో, నేటి బీహార్, ఝార్ఖండ్ ఆటవిక ప్రాంతాల్లో, బ్రిటిషు కాలంలో జరిగిన మిలీనేరియన్ ఉద్యమానికి సారథ్యం వహించాడు. 22 ఏళ్ల వయసు లోనే బ్రిటీషర్లపై యుద్ధం ప్రకటించారు. తద్వారా భారత స్వాతంత్ర్య ఉద్యమ చరిత్రలో ఒక ప్రముఖ వ్యక్తిగా నిలిచిపోయారు. ఇతడి గౌరవార్థం భారత పార్లమెంటులోని సెంట్రల్ హాల్లో ఈయన చిత్రపటం ఉంచారు. ఆయన గుర్తుగా రాంచీలోని విమానాశ్రయానికి బిర్సా ముండా విమానాశ్రయంగా పేరు కూడా పెట్టారు.అలాంటి వ్యక్తి జీవిత చరిత్ర సినిమాగా తెరకెక్కిస్తే ఆయన గొప్పతనం మరింత మందికి తెలుస్తుంది.. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి మరిన్ని వివరాలను దర్శకుడు పా. రంజిత్ తెలియజేయనున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: