సరికొత్త జోనర్ లో అడుగుపెడుతున్న రష్మిక..?

murali krishna
నేషనల్ క్రష్ రష్మిక మందన్న గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. ఛలో సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయిన ఈ భామ ఆ సినిమాతో సూపర్ హిట్ అందుకుంది..ఆ తరువాత ఈ భామకు తెలుగులో వరుసగా స్టార్ సరసన ఆఫర్స్ లభించాయి.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సరసన నటించిన పుష్ప సినిమా పాన్ ఇండియా స్థాయిలో సూపర్ సక్సెస్ సాధించింది.. ఈ సినిమా తో వచ్చిన క్రేజ్ తో ఈ భామకు బాలీవుడ్ లో వరుస ఆఫర్స్ వస్తున్నాయి.గత ఏడాది ఈ భామ నటించిన యానిమల్ మూవీ కూడా పాన్ ఇండియా స్థాయిలో భారీ విజయం సాధించింది. దీనితో ఈ భామకు బాలీవుడ్ లో  భారీగా క్రేజ్ లభించింది. అయితే గత కొంతకాలంగా బాలీవుడ్ లో భారీ సక్సెస్ లు లేవు చాలా కాలం తరువాత బాలీవుడ్‌ ఇండస్ట్రీకి మంచి రోజులొచ్చాయి. అజయ్‌ దేవ్‌గన్‌ నటించిన సైతాన్‌ సినిమాతో మంచి హిట్టందుకున్నాడు.ఇటీవలే విడుదలైన స్త్రీ 2 ఏకంగా రికార్డుల పరంపర సృష్టిస్తుంది.ఈ రికార్డులను బద్దలు కొట్టేందుకు  రష్మిక సైతం సిద్ధం అంటుంది.. 
ఇప్పటిదాకా గ్లామరస్‌ రోల్స్‌లో మెరిసిన రష్మిక  త్వరలో అందరినీ భయపెట్టిస్తానంటోంది.

రష్మిక హిందీలో ఓ హార్రర్ సినిమాకు సైన్ చేసింది.. ఈ చిత్రానికి ‘వ్యాంపైర్ ఆఫ్ విజయనగర’ అనే టైటిల్ ను ఖరారు చేశారు.  అంటే విజయనగర పిశాచం అని అర్థం. హారర్‌ కామెడీ స్టైల్‌లో ఈ చిత్రాన్ని రూపొందించినట్లు తెలుస్తోంది. ఆదిత్య సర్పోత్‌దత్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. గతంలో ఆదిత్య సర్పోత్‌దత్ వస్వస్తున్న చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ సినిమా షూటింగ్ అక్టోబర్ నుంచి ప్రారంభం కానుందని సమాచారం.. ఈ చిత్రంలో ఆయుష్మాన్ ఖురానా ప్రధాన పాత్రలో నటిస్తున్నారు..ప్రస్తుతం ఈ భామ తెలుగు, తమిళం, హిందీలో వరుస సినిమాలు చేస్తోంది. ఈ భామ నటిస్తున్న పుష్ప ది రూల్, ది గర్ల్‌ ఫ్రెండ్‌, రెయిన్‌ బో, సికిందర్‌, కుబేర వంటి సినిమాలు ప్రస్తుతంషూటింగ్‌ దశలో ఉన్నాయి.దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పుష్ప సినిమాకు సీక్వెల్ గా వస్తున్న పుష్ప ది రూల్ డిసెంబర్ 6న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: