బాలయ్యకు పద్మభూషణ్ వరించనుందా

Suma Kallamadi
టాలీవుడ్‌లో ఎవ్వరి పేరుపై లేని ఘనత బాలయ్యపై ఉంది. ఆయన తన జీవితంలో యాభై ఏళ్ల పాటు సినీ జీవితంలోనే గడిపారు. ఒక అర్ధ శతాబ్దం పాటు వెండితెరపై ఉండటం అంటే సాధారణ విషయం కాదు. అది కూడా హీరోగా ఇన్నేళ్లపాటు ఉండటం చాలా గ్రేట్. అందుకే బాలయ్య స్వర్ణోత్సవ సంబరాలకు రెడీ అవుతున్నారు. టాలీవుడ్ లోనే కాదు బాలీవుడ్ లో కూడా హీరోగా యాభై ఏళ్లు పూర్తి చేసుకున్నవారు లేరు. దీంతో భారతీయ సినీ ఇండస్ట్రీలో ఒకే ఒక్కడుగా బాలయ్య నిలిచారు. తండ్రి చాటు బిడ్డగా కెరీర్‌ను స్టార్ట్ చేసిన బాలయ్య ఆ తర్వాత తన నటనతో అందర్నీ ఆకట్టుకున్నాడు.
ఎన్టీఆర్ వారసుడు బాలయ్య అనే పేరును సుస్థిరం చేసుకున్నారు. ఆ తర్వాత అంచలంచెలుగా ఎదిగి సోలో హీరోగా 1984లో ఎంటర్ అయ్యారు. తన కెరీర్‌లో బాలయ్య మొదట చేసిన మూడు సినిమాలు అంతగా ఆడలేదు. దాంతో మొదట్లో ఆయనపై నెగిటివ్ టాక్ ఎక్కువైంది. ఎన్టీఆర్ కూడా పాలిటిక్స్ లో బిజీగా ఉండగా బాలయ్య సినిమాల్లో బిజీ అయ్యారు. దీంతో బాలయ్యకు సినీ రంగంలో కొన్ని ఇబ్బందులు ఎదురయ్యాయని చెప్పొచ్చు. ఓ వైపు చిరంజీవి సుప్రీం హీరోగా ఎదుగుతున్నాడు. మరోవైపు సుమన్, అర్జున్ లాంటి హీరోలు తమ హీరోయిజాన్ని బయటపెడుతున్నారు. ఆ టైంలో బాలయ్య సినిమా ఊసే లేదు. దీంతో తొలినాళ్లలో అనుభవంతోనే బాలయ్య నిలదొక్కుకున్నారు. ఆ తర్వాత మంగమ్మగారి మనవడు మూవీతో బాలయ్యకు స్టార్ డమ్ వచ్చింది. దీంతో వెనక్కి తిరిగి చూసుకోలేదు.
బాలయ్య రానురాను నిర్మాతల హీరోగా మారాడు. ఒకసారి స్క్రిప్ట్ వింటే చాలు మళ్లీ అందులోకి వేలుపెట్టేవారు కాదు. ఇవన్నీ బాలయ్యతో మరిన్ని సినిమాలు చేయించాయి. అన్ని జానర్లలో కథలు వింటూ సినిమాలు చేశాడు బాలయ్య. ఎన్నో వైవిధ్యమైన పాత్రల్లో నటించారు. సేవారంగంలోనూ పాతికేళ్లుగా బసవతారకం ఆస్పత్రి ఛైర్మన్‌గా ఉంటూ వస్తున్నారు. తెలుగువారికి ఇంతలా సేవ చేస్తున్న బాలయ్యకు పద్మ పురస్కారం ఇవ్వడం ఎంతో అవసరమని ఆయన అభిమానులు ఆశిస్తున్నారు. ఈసారి గణతంత్ర అవార్డుల వేడుకల్లో పద్మ అవార్డులను ప్రకటించనున్నారు. అందులో బాలయ్య పేరు రావాలని ఎంతో మంది కోరుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: