క్యాస్టింగ్ కౌచ్ పై మాలీవుడ్ లో ఎంతోమంది నటీమణులు బయటికి వచ్చి అన్ని విషయాలు బయటపెడుతున్నారు. ఇప్పటికే చాలామంది నటీమణులు నోరు బయట పెట్టిడంతో ఎంతోమంది వీరికి మద్దతుగా నిలుస్తున్నారు ఇందులో భాగంగా
టాలీవుడ్ హీరోయిన్ సమంత కూడా
హేమ కమిటీ రిపోర్ట్ ని మెచ్చుకుంటూ
టాలీవుడ్ లో కూడా ఇలాంటి ఒక కమిటీ వేయాలి అని
గవర్నమెంట్ ని ఉద్దేశిస్తూ
సమంత సోషల్
మీడియా ఖాతాలో ఒక స్టోరీ షేర్ చేసిన సంగతి మనకు తెలిసిందే.అయితే ఈ స్టోరీ పై ప్రస్తుతం
టాలీవుడ్ మీడియాలో
రచ్చ జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే ప్రముఖ
మీడియా ఛానల్ వాళ్ళు
నిర్మాత నట్టి
కుమార్ ని ఈ విషయం గురించి అడగగా.. ఆయన
సమంత చేసిన ట్వీట్ గురించి స్పందిస్తూ..
టాలీవుడ్ లో కూడా ఇలాంటి ఒక కమిటీ ఉంది. అది గతంలోనే 2019లో వేశారు.
ఈ కమిటీకి
జీవిత రాజశేఖర్ నేతృత్వం వహించారు. ఇందులో
టాలీవుడ్ లోని ఎవరైనా సరే అంతర్గత ఫిర్యాదులు చేసుకోవచ్చు అని ఆ కమిటీ చెప్పింది. అయితే ఆ టైంలో టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇచ్చి మీకు ఏదైనా ఇబ్బందులు ఉంటే చెప్పండి అని చెప్పారు.ఇక ఆ సమయంలో కొంతమంది
జూనియర్ ఆర్టిస్టులు క్యారవ్యాన్ లేకుండా బయటే భోజనాలు చేస్తూ బయటే బట్టలు మార్చుకోవడానికి ఇబ్బందులు ఉండేవి అని, బయట వాష్ రూమ్ వెళ్లడానికి కూడా ఇబ్బందులు ఉండేవానే విషయాన్ని బయటపెట్టారు. సమంతకి
కేరళ తరహా కమిటీని ఇక్కడ వేయాలని ఎందుకు అనిపించిందో మాకు తెలియడం లేదు.
ఆమెకు ఏం జరిగిందో
మా అసోసియేషన్ కి చెబితే సరిపోతుంది కదా. అని చెప్పారు.అయితే
నిర్మాత మాటలకి అసలు
టాలీవుడ్ క్యాస్టింగ్ కౌచ్ లేదా అని జర్నలిస్టు అడిగితే.. క్యాస్టింగ్ కౌచ్ అనేది ఒక ఆడ మగ ఉన్న ప్రతి చోటా ఉంది కేవలం సినిమాల్లోనే కాదు..
సినిమా ఇండస్ట్రీలో అవకాశం కావాలంటే లొంగిపోవాలి అన్న సమయంలో వాళ్ళు ఎందుకు లొంగాల్సి వస్తుంది.వాళ్లకు ఆ క్యారెక్టర్ సెట్ అవ్వకపోతే నేను చేయను అని వెళ్లాలి.కానీ అవకాశం కోసం వాళ్లే లొంగిపోతున్నారు. అలా లొంగాల్సిన అవసరం లేదు కదా.. ఒకవేళ అవకాశం ఇస్తానని చెప్పి అలాంటి పనులు చేసేవాడిని చెప్పుతో కొట్టాలి అంటూ
నిర్మాత నట్టి
కుమార్ సంచలన వ్యాఖ్యలు చేసారు.