స్టార్ హీరోల సినిమాలు రీ రిలీజ్ అయినప్పుడు థియేటర్స్ లో ఫ్యాన్స్ రచ్చ చేస్తారని తెలిసిందే. ఇక పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే మాములు హడావిడి ఉండదు. పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సెప్టెంబర్ 2న గబ్బర్ సింగ్ సినిమా రీ రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. హరీశ్ శంకర్ దర్శకత్వంలో పవన్ హీరోగా నటించిన గబ్బర్ సింగ్ చిత్రం 2012 మే 11వ తేదీన రిలీజైంది. భారీ బ్లాక్‌బస్టర్ కొట్టింది. ఈ చిత్రంలో పవన్ యాక్షన్, డైలాగ్స్, స్వాగ్, మేనరిజమ్స్ అభిమానులను ఊపేశాయి. బండ్ల గణేశ్ నిర్మించిన ఈ మూవీకి దేవీశ్రీప్రసాద్ సంగీతం అందించారు.అయితే పవన్ సినిమా రీ రిలీజ్ కి థియేటర్స్ దొరకట్లేదట. కొంతమంది ఎగ్జిబిటర్లు థియేటర్స్ ఇవ్వట్లేదట. పవన్ ఫ్యాన్స్ రచ్చ చేసి థియేటర్స్ నాశనం చేస్తారు, సీట్స్ ఇరగ్గొడతారు అని థియేటర్స్ ఇవ్వము అని చెప్తున్నారంట.పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా నటించిన గబ్బర్ సింగ్ సినిమా 12 ఏళ్ల తర్వాత మళ్లీ థియేటర్లలోకి వస్తోంది. ఈ మూవీని మళ్లీ వెండితెరపై చూసేందుకు ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు.
టికెట్ల అడ్వాన్స్ బుకింగ్స్ మొదలుకాగా.. చాలా చోట్ల ఇప్పటికే హౌస్ ఫుల్స్ అయ్యాయి. అయితే, డిమాండ్ ఉన్నా అభిమానుల హంగామాకు భయపడి కొన్ని చోట్ల గబ్బర్ సింగ్ మూవీకి థియేటర్లు ఇచ్చేందుకు యజమానులు వెనకడుగు వేస్తున్నారని సమాచారం. ఈ విషయంపైనే నిర్మాత బండ్ల గణేశ్ స్పందించారు. గబ్బర్ సింగ్ సినిమా రీ-రిలీజ్ కోసం ఆగస్టు 31ప్రెస్‌మీట్‌ను మూవీ టీమ్ నిర్వహించింది. నిర్మాత బండ్ల గణేశ్, దర్శకుడు హరీశ్ శంకర్ సహా మరికొందరు ఈ మీట్లో పాల్గొన్నారు. పవన్ కల్యాణ్‌కు భక్తుడినంటూ మరోసారి సుదీర్ఘంగా స్పీచ్ అదరగొట్టారు బండ్ల గణేశ్. థియేటర్ యాజమాన్యాలకు కూడా రిక్వెస్ట్ చేశారు.పవన్ కల్యాణ్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా, జనసేన అధినేతగా, కేంద్ర ప్రభుత్వంలో కీలకమైన నేతగా ఉన్నారని, అందుకే ఆయన అభిమానులు కూడా బాధ్యతగా నడుచుకోవాలని బండ్ల గణేశ్ సూచించారు. చాలా మంది గబ్బర్ సింగ్ చిత్రానికి థియేటర్లను ఇవ్వడం లేదని, ఫ్యాన్స్ సీట్లు విరగ్గొడతారని చెబుతున్నారని బండ్ల అన్నారు. పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ క్రమశిక్షణగా ఉంటారని ఆయన చెప్పారు.
అభిమానులు థియేటర్లకు ఎలాంటి నష్టం చేయరని, పవన్ కల్యాణ్ అభిమానిగా, భక్తుడిగా మాట ఇస్తున్నానని బండ్ల గణేశ్ అన్నారు. “ఎగ్జిబిట్లందరికీ చెబున్నా దయచేసి థియేటర్లు ఇవ్వండి. సెప్టెంబర్ 2న పవన్ కల్యాణ్ అభిమానులు ఉదయం గుడికి వెళతారు. ఆ తర్వాత థియేటర్‌కు వెళతారు. గుడికి వెళ్లి పవన్ వందేళ్లు బతకాలని కోరుకుంటారు. థియేటర్‌కు వెళ్లి ఉత్సవాలు చూసుకుంటారు. ఈ రెండింటిలో మమ్మల్ని నిరుత్సాహపరచవద్దు” అని బండ్ల గణేశ్ చెప్పారు.పవన్ కల్యాణ్ లైనప్‌లో ప్రస్తుతం ఓజీ, హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలు ఉన్నాయి. ఆయన పుట్టిన రోజైన సెప్టెంబర్ 2న ఈ చిత్రాల నుంచి అప్డేట్స్ రానున్నాయి.