పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తున్న ‘ఓజీ’ సినిమా కోసం అభిమానులు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రానికి క్రేజ్ విపరీతంగా ఉంది. సుజీత్ ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ ఏడాది ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు, ఆ తర్వాత ఉపముఖ్యమంత్రిగా పవన్ బాధ్యతలు చేపట్టడంతో ఓజీ షూటింగ్ నిలిచింది. అయితే, త్వరలోనే ఆయన మళ్లీ చిత్రీకరణలో పాల్గొంటారనే అంచనాలు ఉన్నాయి. ఈ తరుణంలో రిలీజ్ డేట్‍ను ఈ మూవీ ఖరారు చేసిందనే సమాచారం బయటికి వచ్చింది.బ్రో మూవీ తర్వాత పవన్ కల్యాణ్ నటించిన మరో మూవీ రిలీజ్ కాలేదు. ఈ ఓజీతోపాటు హరి హర వీర మల్లు, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలను పవన్ చేస్తున్నాడు. అయితే మధ్యలో ఏపీ ఎన్నికలు రావడం, జనసేన అధ్యక్షుడిగా ఎన్నికల బరిలో నిలిచి మొదట ఎమ్మెల్యేగా గెలిచిన పవన్.. తర్వాత ఏపీకి డీప్యూటీ సీఎం అయ్యాడు.దీంతో కొంతకాలం పాటు సినిమాలను పక్కన పెట్టాడు. అయితే తొలిసారి డిప్యూటీ సీఎం హోదాలో ఓజీ మూవీ షూటింగ్ లో పవన్ పాల్గొనబోతున్నట్లు తాజాగా డీవీవీ దానయ్య ఇచ్చిన అప్డేట్ తో స్పష్టమవుతోంది.ఈ నేపథ్యంలోనే ఒక ఇంటర్వ్యూలో భాగంగా ఓ జి మూవీ నిర్మాత డివివి దానయ్య అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు.
ఈ సినిమాను బ్లాక్ బాస్టర్ చేసి పవర్ స్టార్ కు గిఫ్ట్ ఇస్తా. వచ్చే ఏడాది మార్చి నెలాఖరులోపే విడుదల చేస్తాం. ఆ నెల దాటనివ్వను. దీని బడ్జెట్ 200 కోట్ల పైనే, హిందీలో కూడా రిలీజ్ చేస్తాం అని చెప్పుకొచ్చారు. ఓజీ సినిమా షూటింగ్‍లో పవన్ కల్యాణ్ త్వరలోనే మళ్లీ పాల్గొంటారని తెలుస్తోంది. ఇప్పటికే ఈ మూవీ లుక్‍లోకి క్రమంగా ఆయన వస్తున్నారు. చిత్రీకణకు మూవీ టీమ్ ఏర్పాట్లు చేస్తున్నట్టు సమాచారం. పాన్ ఇండియా రేంజ్‍లో ఈ చిత్రం రూపొందనుంది.ఓజీ చిత్రంలో పవన్ కల్యాణ్‍కు జోడీగా ప్రియాంక మోహన్ నటిస్తున్నారు. గ్యాంగ్‍స్టర్స్ యాక్షన్ డ్రామాగా ఈ చిత్రాన్ని సుజీత్ తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో పవన్ క్యారెక్టర్ పేర్ ఓజాస్ గంభీర అని, అందుకే ఓజీ టైటిల్ పెట్టామని ఆయన చెప్పారు. ఈ మూవీకి జపనీస్ లింక్ కూడా ఉంటుందని అన్నారు.ఓజీ మూవీలో బాలీవుడ్ స్టార్ ఇమ్రాన్ హష్మి విలన్‍గా నటిస్తున్నారు. అర్జున్ దాస్, ప్రకాశ్ రాజ్, శ్రీయారెడ్డి, ప్రకాశ్ రాజ్, హరిష్ ఉత్తమన్, అభిమన్యు సింగ్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. డీవీవీ ఎంటర్‌టైన్‍మెంట్ పతాకంపై డీవీవీ దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు.పవన్ కల్యాణ్ లైనప్‍లో హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రాలు కూడా ఉన్నాయి. ఆయన పుట్టిన రోజైన సెప్టెంబర్ 2న ఈ చిత్రాల నుంచి కూడా అప్‍డేట్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి.