బాలయ్య స్వర్ణోత్సవం: కంటిచూపుతో బాక్సాఫీస్ ని శాసించిన "నరసింహ నాయుడు".!!
-కత్తులతో కాదు కంటిచూపుతో చంపేస్తా..
-చిరంజీవి,వెంకటేష్ సినిమాలను వెనక్కి నెట్టిన బాలయ్య..
- 60 లక్షల బ్రిడ్జ్.. 36 సుమోలతో సంచలన ఫైట్..
-బాక్సాఫీస్ బోనాంజ బాలయ్య..
బాలకృష్ణ.. తెలుగు సినిమా ఇండస్ట్రీలో నందమూరి నటసింహంగా ఎంతో గుర్తింపు తెచ్చుకున్నారు. ఇండస్ట్రీలో ఎవరు కూడా లేని విధంగా ఓవైపు రాజకీయాలు మరోవైపు సినిమాలను బ్యాలెన్స్ చేస్తూ వస్తున్నటువంటి హీరో అని చెప్పవచ్చు. ఫ్యాక్షన్ బ్యాక్గ్రౌండ్ ఉన్న సినిమాలు అనగానే చాలామందికి బాలకృష్ణ సినిమాలే గుర్తుకు వస్తాయి. అలా తన కెరీర్లో ఎన్నో చిత్రాల్లో నటించి కోట్లాదిమంది గుండెల్లో కొలువుదీరిన బాలకృష్ణ నటన రంగంలోకి ఎంట్రీ ఇచ్చి 50 సంవత్సరాలు పూర్తయింది. ఈ సందర్భంగా తెలుగు ఇండస్ట్రీ ఆయనకు ఘనంగా 50 సంవత్సరాల సర్వోత్సవ వేడుకలను నిర్వహిస్తోంది. అలాంటి ఈ వేడుకల సందర్భంగా బాలకృష్ణ సినీ కెరియర్ ను అద్భుతంగా మార్చేసిన సినిమా నరసింహనాయుడు గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం..
బాక్సాఫీస్ పై చెడుగుడు :
సంక్రాంతి వచ్చిందంటే చాలు చాలామంది హీరోల సినిమాలు పోటీలో నిలుస్తాయి. ఆ విధంగానే 2001 సంక్రాంతి సమయం ఈ టైంలో ముగ్గురు స్టార్ హీరోల సినిమాలు పోటీలో ఉన్నాయి. ఇందులో మెగాస్టార్ నటించిన మృగరాజు, వెంకటేష్ నటించిన దేవి పుత్రుడు, బాలకృష్ణ హీరోగా చేసిన నరసింహనాయుడు ఈ చిత్రాలు మూడు సంక్రాంతి బరిలో హోరాహూరిగా తలపడ్డాయి. ఇంతటి పోటీలో కూడా బాలకృష్ణ చేసిన నరసింహనాయుడు ఇండస్ట్రీ హిట్ సాధించింది. డైరెక్టర్ బి గోపాల్,బాలకృష్ణ కాంబోలో ఈ చిత్రం ప్రారంభమైంది. ఇది బి గోపాల్ కి 25వ సినిమా. చాలా ప్రెస్టీజియస్ గా తీసుకొని సంచలనం సృష్టించాలని అనుకున్నాడు. వెంటనే బి.గోపాల్ తన టచ్ లో ఉన్నటువంటి చిన్ని కృష్ణని పిలిచి అద్భుతమైన కథ తెప్పించారు. పంజాబ్లో ప్రతి ఫ్యామిలీ నుండి ఒకరు ఆర్మీలోకి పోవాలనే రూల్ ఉంది. దాన్నిబట్టి కథ తయారు చేశాడు చిన్నికృష్ణ.