సరిపోదా శనివారం.. నాని యు ' నాని ' మస్ హ్యాట్రిక్ ..!
- వరుసగా మూడో విజయంతో హ్యాట్రిక్ కొట్టిన నేచురల్ స్టార్
- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) .
నేచురల్ స్టార్ నాని నటించిన సరిపోదా శనివారం భారీ అంచనాల మధ్య ప్రేక్షకులు ముందుకు వచ్చింది. ఈ సినిమాకు మంచి హిట్ టాక్ రావడంతో బాక్సాఫీస్‌ను షేక్ చేస్తూ దూసుకుపోతోంది. కంప్లీట్ అవుట్ అండ్ అవుట్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా సరిపోదా శనివారం మూవీ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఈ సినిమాను యువ దర్శకుడు వివేక్ ఆత్రేయ తరకెక్కించిన తీరుకే ప్రేక్షకులు ఫిదా అయిపోతున్నారు. నాని.. మాస్ అవతారంలో చేసిన ఈ శివతాండవం థియేటర్లలో వసూళ్ల వర్షం కురిపిస్తుంది.
తాజాగా ఈ సినిమా రిలీజ్ అయిన మూడు రోజుల్లోనే రూ.50 కోట్ల క్లబ్ లో చేరిపోయింది. పైగా గురువారం సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ రోజు ఆదివారం అన్నిచోట్ల హౌస్ ఫుల్స్ కనపడుతున్నాయి. ఈరోజు కూడా అదిరిపోయే వసూళ్లు వస్తాయని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు.. అటు ఓవర్సీస్ లోను నాని సినిమాకు కళ్ళు చెదిరే వసూళ్లు వస్తున్నాయి. ఓవర్సీస్ లో అయితే ఇప్పటికే ఏకంగా రూ.1.5 మిలియన్ డాలర్ల మార్క్ చేరుకుంది.
ఇదే ఊపు కొనసాగితే ఆది, సోమవారాల నాటికే రెండు మిలియన్ డాలర్ల క్లబ్ లోకి చేరుతుందని తెలుస్తోంది. ఇక నాని గత రెండు సినిమాలు కూడా రూ.50 కోట్ల క్లబ్ లోకి చేరాయి. ఇప్పుడు సరిపోదా శనివారం సినిమాతో నాని హ్యాట్రిక్ విజయాన్ని అందుకున్నాడు. ఏది ఏమైనా యునానిమస్‌గా ఈ సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో మేకర్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. త్రిబుల్ ఆర్ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ సినిమా తెరకెక్కించిన డివీవీ దానయ్య ఈ సినిమాను నిర్మించారు.