పవర్ స్టార్ పవన్ కల్యాణ్.. ఆ పేరు వింటే ఒక వైబ్రేషన్. అది సినిమాల్లో అయినా రాజకీయాల్లో అయినా.. సినిమాల్లోకి రాకముందు చిరంజీవి తమ్ముడిగానే తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన కొణిదల కల్యాణ్ ఆ తర్వాత తన పవర్ ఏమిటో చూపి పవన్ కల్యాణ్‌గా మారారు.ఏపీ డిప్యూటీ సీఎం, జన సేన అధినేత పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు (సెప్టెంబర్ 2) సందర్భంగా సోషల్ మీడియా అంతా కూడా సందడి వాతావరణం నెలకొంది. ఫ్యాన్స్, టాలీవుడ్ ప్రముఖులు, రాజకీయ నాయకులు సోషల్ మీడియా వేదికగా పవన్ కళ్యాణ్‌కు విషెస్ తెలియజేస్తున్నారు. ఈ క్రమంలో పవన్ ఫ్యాన్స్ రేపు ఫుల్ రచ్చ చేయడానికి రెడీగా ఉన్నారు. ఇప్పటికే చాలా చోట్ల పవన్ పుట్టిన రోజు సెలబ్రేషన్స్ ఫ్యాన్స్ చేస్తున్నారు. మరో పక్క సేవ కార్యక్రమాలు కూడా అనిర్వహిస్తున్నారు. ఇక అథియేటర్స్ లో గబ్బర్ సింగ్ రీ రిలీజ్ చేసి సందడి చేస్తున్నారు.ఈ నేపథ్యంలోపవన్ పుట్టిన రోజుకు పవన్ చేతిలో ఉన్న సినిమాల నుంచి ఏదో ఒక స్పెషల్ ఫ్యాన్స్ కోసం రిలీజ్ చేస్తారని భావించారు. అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో తాజాగా OG సినిమా నిర్మాణ సంస్థ ఓ ప్రకటన చేసింది.DVV ఎంటర్టైన్మెంట్స్ తమ సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ అదిరిపోయే పోస్టర్ ఒకటి షేర్ చేసి.. కొన్ని గంటల్లో పవర్ ప్యాక్డ్ ఫైర్ సెలబ్రేషన్స్ మొదలవ్వనున్నాయి. OG కేవలం సినిమా మాత్రమే కాదు సెలబ్రేషన్ లాంటిది. పవన్ కళ్యాణ్ స్పెషల్ డేని ఇంకా గొప్పగా చేయాలని ప్లాన్ చేసాము. కానీ ప్రస్తుతం వర్షాలు, వరదలు, ఉన్న పరిస్థితుల కారణంగా సెలబ్రేషన్స్ ని వాయిదా వేస్తున్నాము. కానీ మిమ్మల్ని నిరుత్సాహపరచాము. రేపు ఫస్ట్ సింగిల్ రిలీజ్ డేట్ ఎప్పుడో చెప్తూ ఓ కొత్త పోస్టర్ రిలీజ్ చేస్తాము. రేపు స్పెషల్ డే ఎంజాయ్ చేసి సెలబ్రేషన్స్ వచ్చే రోజుల్లో కూడా చేసుకోండి అంటూ పోస్ట్ చేసింది.నిర్మాతల నిర్ణయం తో పవర్ స్టార్ అభిమానులు తీవ్ర నిరాశ వ్యక్తం చేస్తున్నారు. దీంతో పవన్ ఫ్యాన్స్ రేపు రాబోయే పవన్ పోస్టర్, ఆ తర్వాత సాంగ్ కోసం ఎదురుచూస్తున్నారు.
ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ సినిమాలకు ఎలాంటి యుఫోరియా, హైప్ ఉందో పక్కన పెడితే… ఓజీ సినిమాపై మాత్రం ఒక స్థాయిని మించిన అంచనాలున్నాయి. కేవలం ప్రీ లుక్ పోస్టర్‌తోనే సినిమాపై వేల కోట్ల అంచనాలు క్రియేట్ చేశాడు సుజీత్. ఇక ఒక్క గ్లింప్స్‌తో కేవలం టాలీవుడ్‌ను మాత్రమే కాదు.. యావత్ ఇండియాను ఒక ఊపు ఊపేశాడు. పవన్ లైనప్‌లో ఎన్ని సినిమాలున్నా.. అభిమానులు మాత్రం కాస్త ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంది ఓజీ సినిమాపైనే. అర్థం చేసుకోలేక ఫ్లాప్ చేశామే కానీ.. సాహో సినిమా రేంజ్ వేరన్నది ఎందరో అన్న మాటలు. అలాంటి సుజీత్ నుంచి ఐదేళ్ల తర్వాత సినిమా, అది కూడా పవన్ కళ్యాణ్‌తో అంటే అంచనాలు ఖచ్చితంగా తారా స్థాయిలోనే ఉంటాయి.బాగా ఆకలితో ఉన్న వాళ్లకు బిర్యానీ ప్యాకెట్ దొరికితే వాళ్ల సంతోషం ఏలా ఉంటుందో.. ఓజీ సినిమా విషయంలో పవన్ ఫ్యాన్స్ అంతకంటే ఎక్కువే ఆనందంతో ఉన్నారు. ఇన్నాళ్లు రీమేక్ సినిమాలతో చచ్చుబడిపోయిన నాలుకకు, ఓజీ అంటూ అసలైన ఘాటును అంటించాడు సుజీత్. నిజానికి అన్ని అనుకున్నట్లుగా కుదిరితే.. ఈ పాటికే ఓజీ ఫీవర్ ఇండియాను తాకేసేది. ముందుగా ఈ సినిమాను సెప్టెంబర్ 27న రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేశారు. కానీ పవన్ రాజకీయాలతో బిజీ కారణంగా షూటింగ్ ఆలస్యమైంది. దాంతో సినిమాను పోస్ట్ పోన్ చేశారు.పోస్ట్ పోన్ చేసిన విషయం చెప్పారు కానీ.. కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడన్నది మాత్రం చెప్పలేదు. కాగా తాజాగా నిర్మాత దానయ్య ఈ సినిమా రిలీజ్‌పై ఓ క్లారిటీ ఇచ్చాడు. ఈ సినిమాను ఎట్టి పరిస్థితుల్లో ఏప్రిల్ 2025 లోపే రిలీజ్ చేస్తామని చెప్పాడు. ఈ దెబ్బతో సోషల్ మీడియా షేక్ అయిపోయింది. మరో 7 నెలలో అసలైన తుఫాన్ రాబోతుందని కామెంట్స్ చేస్తున్నారు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ గ్యాంగ్‌స్టర్‌గా కనిపించనున్నాడు. అప్పుడెప్పుడో పుష్కర కాలం ముందు ‘పంజా’ సినిమాలో అటు ఇటుగా కొంచెం గ్యాంగ్‌స్టర్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించాడు.