ఎఫ్ 2, ఎఫ్ 3 తర్వాత విక్టరీ వెంకటేష్, స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్ లో హ్యాట్రిక్ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా.. ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు. క్రైమ్ థ్రిల్లర్ కథాంశంతో రూపుదిద్దుకుంటున్న వెంకటేష్ తాజా చిత్రానికి భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు.2025 సంక్రాంతికి అనిల్ రావిపూడి, వెంకీ హ్యాట్రిక్ మూవీ విడుదల కాబోతోంది. ఇప్పటికే ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా వెల్లడించారు. అయితే ఈ సినిమాకు సంక్రాంతికి వస్తున్నాం అనే విచిత్రమైన టైటిల్ ను పెడుతున్నారట. కథ పరంగా ఆ టైటిల్ సినిమాకు పర్ఫెక్ట్ గా సెట్ అవుతుందని మేకర్స్ భావిస్తున్నారు. ఇందులో భాగంగానే అనిల్-వెంకీ మూవీ కోసం సంక్రాంతికి వస్తున్నాం అనే టైటిల్ ను ప్రొడ్యూసర్ దిల్ రాజు రిజిస్టర్ చేయించారని జోరుగా ప్రచారం జరుగుతోంది.మరి ఈ ప్రచారం ఎంత వరకు నిజమో తెలియాలంటే చిత్ర యూనిట్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సిందే. కాగా, అనిల్-వెంకీ మూవీ జూలై నెలలో సెట్స్ మీదకు వెళ్లింది. హీరో, అతని ఎక్స్ గర్ల్‌ఫ్రెండ్, అతని ఎక్స్లెంట్ వైఫ్.. ఈ మూడు పాత్రల చుట్టూ తిరిగే ఎక్స్ట్రార్డినరీ ట్రైయాంగిల్ క్రైమ్ ఎంటర్టైనర్ గా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఇందులో హీరోగా వెంకీ, అతని గర్ల్‌ఫ్రెండ్ గా మీనాక్షి చౌదరి, వైఫ్ గా ఐశ్వర్య రాజేష్ నటిస్తున్నారు. ఉపేంద్ర లిమాయే, రాజేంద్ర ప్రసాద్, సాయి కుమార్, నరేష్ తదితరులు ఇతర ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు.
ప్రస్తుతం వెంకటేష్ లాంటి స్టార్ హీరో సూపర్ సక్సెస్ ఫుల్ హీరోగా వెలుగొందడమే కాకుండా డిఫరెంట్ పాత్రలను చేస్తూ ముందుకు సాగుతున్నారు.ఇక ఇప్పటికే ఆయన తమిళం లో సూపర్ సక్సెస్ అయిన అసూరన్ సినిమాను నారప్ప పేరుతో రీమేక్ చేసి మంచి విజయాన్ని అందుకున్నాడు.ఇక మొత్తానికైతే ఈ సినిమాలు ఆయన చాలావరకు ఒక సక్సెస్ అందుకుంటూ ముందుకు సాగుతున్నాడు.ఇక తన గత చిత్రం అయిన నిరాశపర్చినప్పటికీ ఈయన కామెడీ ఎన్టీయార్ టైనర్ గా చేసి మంచి సక్సెస్ లను అందుకోవాలని చూస్తున్నాడు.ఇక ఈ సినిమాలో ఒకప్పుడు స్టార్ హీరోయిన్ అయిన సోనాలి బింద్రే కూడా ఒక కీలక పాత్రలో నటించబోతుందనే వార్తలైతే వినిపిస్తున్నాయి. ఇక ఆ తర్వాత అనిల్ రావిపూడి , విక్టరీ వెంకటేష్ కాంబినేషన్ లో రాబోతున్న ఓ ఇంట్రెస్టింగ్ మూవీ కూడా సంక్రాంతికి రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నారు. ఈ సినిమాకు ‘సంక్రాంతికి వస్తున్నాం’ అనే టైటిల్ ను కూడా ఫిక్స్ చేసినట్లు తెలుస్తుంది.అనిల్ , వెంకటేష్ కాంబినేషన్ లో రాబోయే సినిమాకు ఈ టైటిల్ నేమ్ ఎప్పటినుంచో వినిపిస్తున్నా కూడా.. ఇప్పటివరకైతే ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఈ సినిమా దిల్ రాజు బ్యానర్స్ పై తెరకెక్కబోతుంది. దిల్ రాజుకు సంక్రాంతి సమయం బాగానే కలిసి వస్తుంది . గతంలో కూడా ఈ సంక్రాంతికి ఈ బ్యానర్స్ పై వచ్చిన సినిమాలు భారీ సక్సెస్ ను అందుకున్నాయి. కాబట్టి.. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమాను రిలీజ్ చేసే అవకాశాలు అధికంగానే కనిపిస్తున్నాయి.