తండ్రిపై ప్రేమను చాటిన కళ్యాణ్ రామ్- ఎన్టీఆర్..!
ఆ తర్వాత తల్లా పెళ్ళామా, తాతమ్మ కల తదితర చిత్రాలలో ఎన్టీఆర్ స్వయంగా దర్శకత్వం వహించిన ఎన్నో చిత్రాలలో నటించారు. ఆ తర్వాత కొన్నేళ్లు విశ్రాంతి తీసుకున్న హరికృష్ణ నిర్మాణరంగం వైపుగా దృష్టి పెట్టారు.. అలా మొదటిసారిగా డ్రైవర్ రాముడు సినిమాని నిర్మించారు. తన తమ్ముడు బాలయ్యతో పట్టాభిషేకం, పెద్దన్నయ్య, అనసూయమ్మ గారి అల్లుడు తదితర చిత్రాలను నిర్మించి అందులో కూడా పలు కీలకమైన పాత్రలలో నటించారు. మళ్లీ 21 ఒక్క సంవత్సరాల తరువాత శ్రీరాములయ్య చిత్రంతో తన క్రేజీని సంపాదించుకున్నారు హరికృష్ణ.
డైరెక్టర్ వైవిఎస్ చౌదరి డైరెక్షన్లో సీతారామరాజు సినిమాలో ఒక పవర్ఫుల్ పాత్రలో నటించారు. హరికృష్ణ నాగార్జున కలిసి నటించిన ఈ సినిమా భారీ విజయాన్ని అందించింది. ఆ తర్వాత మళ్లీ ఇదే డైరెక్టర్ తో లాహిరి లాహిరి లాహిరిలో సినిమాలో నటించి మంచి విజయాన్ని అందుకున్నారు. టైగర్ హరిచంద్ర ప్రసాద్, సీతయ్య, శివరామరాజు స్వామి వంటి చిత్రాలతో మరింత పేరు సంపాదించారు హరికృష్ణ. ఇంత గొప్ప నటుడు కుమారుడులుగా పుట్టడం మాకు ఆనందం అంటూ ఎన్నోసార్లు కళ్యాణ్ రామ్, జూనియర్ ఎన్టీఆర్ స్పందిస్తూ ఉన్నారు. ఇప్పుడు తాజాగా హరికృష్ణ జయంతి సందర్భంగా సోషల్ మీడియా వేదికగా పలువురు అభిమానులు సినీ సెలబ్రిటీలు ఆయన జ్ఞాపకాలను తెలియజేస్తూ ఉన్నారు.. ముఖ్యంగా కుమారులు అయిన కళ్యాణ్ రామ్, జూనియర్ ఎన్టీఆర్ తన తండ్రికి నివాళులు అర్పించారు.. ఈ అస్తిత్వం మీరు ఈ వ్యక్తిత్వం మీరు.. మీరు ఇచ్చిన ధైర్యంతో కొనసాగుతూ ఉన్నాము.. ఆజన్మాంతం తలుచుకునే మిమ్మల్ని ఎప్పటికీ మరువలేము నాన్న అంటూ ఒక ట్విట్ చేశారు. తన తండ్రి మీద ఎంతో ప్రేమతో ఈ ట్విట్ రాసినట్లు కనిపిస్తోంది.