మళ్లీ రవితేజకు చేదు అనుభవం.. ఈసారి కూడా అదే జరిగేనా..?

Pulgam Srinivas
మాస్ మహారాజా రవితేజ బాక్స్ ఆఫీస్ దగ్గర విజయాన్ని అందుకొని చాలా కాలం అవుతుంది. రవితేజ ఆఖరుగా ధమాకా అనే మూవీ తో బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకున్నాడు. ఈ సినిమాలో మోస్ట్ బ్యూటిఫుల్ నటిమని శ్రీ లీల , రవితేజకు జోడిగా నటించగా ... త్రినాథ్ రావు నక్కిన ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఇకపోతే ఈ సినిమా తర్వాత కొన్ని సినిమాలతో రవితేజ ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆ సినిమాలు ఏవి కూడా యవరేజ్ విజయాలను కూడా అందుకోలేదు. ఇకపోతే తాజాగా రవితేజ "మిస్టర్ బచ్చన్" అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

మంచి అంచనాల నడుమ విడుదల ఈ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఇకపోతే ప్రస్తుతం రవితేజ , భాను భోగవరపు దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీ రవితేజ కెరియర్ లో 75 వ మూవీ గా రూపొందుతుంది. ఈ సినిమాకు టైటిల్ను ఫిక్స్ చేయకపోవడంతో "ఆర్ టి 75" అనే వర్కింగ్ టైటిల్ తో ఈ మూవీ ని రూపొందిస్తున్నారు. ఈ సినిమాలో శ్రీ లీల హీరోయిన్ గా నటిస్తోంది. ఇకపోతే కొంత కాలం క్రితం రవితేజ "ఈగల్" అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

ఈ మూవీ ని మొదట ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. కానీ ఈ సినిమా సంక్రాంతి కి కాకుండా ఆ తర్వాత ఫిబ్రవరి నెలలో విడుదల అయింది. ఇక "ఆర్ టి 75" మూవీ ని కూడా సంక్రాంతి కి విడుదల చేసే ఆలోచనలో మూవీ బృందం ఉన్నట్లు వార్తలు వచ్చాయి. కానీ ఈ సినిమా కూడా సంక్రాంతి భరి నుండి ఆల్మోస్ట్ తప్పుకున్నట్లు తెలుస్తోంది. ఇలా రవితేజ ఈ సారి కూడా సంక్రాంతి బరిలో లేనట్లే అని వార్తలు వస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: