వామ్మో: బీచ్ లో ఎంజాయ్ చేస్తున్న RX -100 బ్యూటీ.. ఫొటోస్ వైరల్..!

Divya
టాలీవుడ్ బోల్డ్ బ్యూటీగా  పేరు సంపాదించిన పాయల్ రాజ్ పుత్ మొదటిసారిగా టాలీవుడ్లోకి ఆర్ఎక్స్ 100 చిత్రంతో మంచి గుర్తింపుని సంపాదించుకుంది. తెలుగులో కంటే ముందుగా పంజాబీ,హిందీ వంటి చిత్రాలలో నటించిన ఫ్లాపులు గానే మిగిలిపోయాయి. అనుకోకుండా టాలీవుడ్లోకి వచ్చి మంచి సక్సెస్ ని అందుకుంది పాయల్.. ఆ తర్వాత ఎన్నో చిత్రాలలో తన అందచందాలతో మంచి మంచి పాత్రలలో నటించిన ఎందుకో ఈ ముద్దుగుమ్మకు సక్సెస్ అయితే అందుకోలేకపోయింది. ఆర్ఎక్స్ 100 సినిమా తర్వాత ఎక్కువగా అలాంటి పాత్రలే వచ్చాయి.

దీంతో ఈ ముద్దుగుమ్మకు సక్సెస్ ల కంటే ఫెయిల్యూర్ సినిమాలు ఎక్కువగా మిగిలిపోయాయి. అయినా కూడా అవకాశాలు మాత్రం వస్తూనే ఉన్నాయి.. మంగళవారం సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నది. లేడీ ఓరియంటెడ్ గా వచ్చిన ఈ ముద్దుగుమ్మ నటనకు ప్రశంసలు అందుకునేలా చేసింది.. సినిమాలలో నటిస్తున్నప్పటికీ సోషల్ మీడియాలో యాక్టివ్గానే ఉంటూ తన గ్లామర్ ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది. సోషల్ మీడియాలో ఈ ముద్దుగుమ్మ షేర్ చేసే అందాల విందు ఫోటోలు క్షణాలలో భారీ వ్యూస్ రాబడుతూ ఉంటాయి.


సోషల్ మీడియాలో నాలుగున్నర మిలియన్ల మంది ఫాలోవర్స్ పైగా కలిగి ఉన్నారు. తాజాగా పాయల్ షేర్ చేసిన బీచ్ ఫోటోలు తెగ వైరల్ గా మారుతున్నాయి.రెడ్ కలర్ బికినీలో తన అందచందాలతో హోయలు పలుకుతూ ఫోటోలకు ఫోజులు ఇచ్చినట్టుగా కనిపిస్తోంది. స్విమ్ సూట్ తో తన అందంతో మరింత ఫిదా చేస్తోంది అంటూ నెటిజెన్స్ కామెంట్లు తెలుపుతున్నారు. ముఖ్యంగా సముద్రంలో కూడా స్టైలిష్ గా ఫోజులు ఇస్తూ సేద తీరుతూ ఉన్నట్టుగా కనిపిస్తోంది పాయల్. ఆకట్టుకునే అందం అభినయం ఉన్నప్పటికీ ఈ ముద్దుగుమ్మకు సరైన సినిమా కథ పెడితే కచ్చితంగా స్టార్ హీరోయిన్ స్టేటస్ అందుకుంటుంది అనే విధంగా అభిమానులు నమ్ముతున్నారు. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ రెండు తమిళ సినిమాలతో పాటు ఒక తెలుగు చిత్రంలో నటిస్తోందట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: