మెగా- అల్లు వివాదంపై.. బాలయ్య అలాంటి కామెంట్స్..?

Divya
ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల నేపథ్యంలో మొదలైన మెగా -అల్లు కుటుంబాల మధ్య వివాదాలు ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా అల్లు అర్జున్ వైసీపీ అభ్యర్థికి సపోర్టు ఇవ్వడంతో మొదలైన ఈ రచ్చ పవన్ కళ్యాణ్ స్మగ్లింగ్ పాత్రల గురించి మాట్లాడే వరకు వచ్చింది. కానీ అల్లు అర్జున్ మామ గారి ఈసారి తెర మీదకి వచ్చి పవన్ కళ్యాణ్ ని సైతం హెచ్చరించడం జరిగింది. తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోకపోతే ఖచ్చితంగా చర్యలు తప్పవని కూడా తెలియజేశారు. అయితే ఇలాంటి సమయంలోనే బాలకృష్ణ 50 ఏళ్లు ఇండస్ట్రీలోకి వచ్చి పూర్తి చేసుకున్న సందర్భంగా ఒక యూట్యూబ్ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇస్తూ ఈ రెండు కుటుంబాల మధ్య రిలేషన్షిప్ గురించి వెల్లడించారు.

మెగా అల్లు కుటుంబాల మధ్య ఎలాంటి విభేదాలు లేవని కూడా తెలియజేశారు.. చిరంజీవి కొడుకు రామ్ చరణ్ అల్లు అరవింద్ కొడుకు అర్జున్ చాలా ఫన్నీగా ఉంటారని ఇటీవల పుష్ప-2 సినిమా షూటింగ్ సెట్ కి వెళ్లాను అక్కడ బన్నీ డైరెక్టర్ సుకుమార్ తో చాలా సేపు మాట్లాడానని.. అల్లు అరవింద్ గారి కోసమే అన్ స్టాపబుల్ షో చేశానని కూడా తెలిపారు. తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవని తెలిపారు. ఈమధ్య కొన్ని బిజీ షెడ్యూల్ వల్ల కలవలేక పోతున్నారని తెలిపారు.

ఏది ఏమైనా సినిమా ఈవెంట్లో కలిసినప్పుడు చాలా సరదాగా అందరితో కలిసి మెలిసి ఉంటామని బాలయ్య తెలియజేశారు. బాలయ్య చేసిన వాక్యాలు మెగా అల్లు అభిమానులకు కాస్త ఆనందాన్ని ఇచ్చినప్పటికీ ఈ రెండు ఫ్యామిలీల విభేదాల పైన మరింత క్లారిటీ రావాలి అంటే కనీసం ఈ రెండు కుటుంబాలు కలిసి ఒక ఫోటో ఏదైనా మెగా కుటుంబం నుంచి వస్తే బాగుంటుందని అభిమానులైతే భావిస్తూ ఉన్నారు. ప్రస్తుతం మెగా హల్లు అభిమానులు అయితే సోషల్ మీడియాలో అసభ్య పదాలతో మాట్లాడుకునే పరిస్థితి ఏర్పడింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: